పత్రిక ప్రకటన తేది : 26.04.2022. మే 6 నుండి 24 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీ గా నిర్వహించాలి:అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్

జిల్లాలో మే 6 నుండి 24 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరిక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బంధిగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళ వారం
కల్లెక్టరేట్ కార్యాలయం లో ఆయన ఛాంబర్ లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ పై ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశం లో ఆయన మాట్లాడుతూ జిల్లా లో జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందిగా చేయాలనీ, శాఖల వారిగా చేయాల్సిన పనులను సంబంధిత అధికారులు సమన్వయము తో పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొదటి సంవత్సరం 17206 మంది, రెండవ సంవత్సరం 17204 మంది విద్యార్థినీ,విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నట్లు తెలిపారు. జిల్లా లో పరిక్షల నిర్వహణ కు 51 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాలలో ప్రశ్నా పత్రాలను సి.సి. కెమెరాల పర్యవేక్షణ లో సీల్ తీయాలని, పరీక్షా సమయం లో నిరంతర విద్యుత్ సరపరా ఉండేవిధంగా చూడాలని అన్నారు. పరీక్షా కేంద్రాలను మూడు రోజులు ముందుగానే పూర్తిగా సానిటైజ్ చేయించాలని, ఎండలు ఎక్కువగా ఉన్నందున అన్ని సెంటర్ లలో తాగు నీటి వసతి ఏర్పాటు చేయాలని, ప్రతి కేంద్రానికి ఇద్దరు వైద్య సిబ్బంది ని ఏర్పాటు చేసి, విద్యార్థిని , విద్యార్థులు ఏదైనా అస్వస్థతకు గురైతే వెంటనే వైద్య సేవలు అందించేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. పరీక్ష ప్రశ్నాపత్రాలను నిల్వ చేయడానికి జిల్లాలో 14 స్టోరేజి పాయింట్ లను గుర్తించినట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాలు నిల్వ చేసీన పోలీస్ స్టేషన్లలో బందోబస్తు ఏర్పాటు చేయాలని, పోలీస్ బందోబస్తు తో ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు పంపిణి చేయాలనీ, ప్రతి సెంటర్ కు ఇద్దరు పోలీస్ సిబ్బందిని బందోబస్తుగా ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలనీ, పరీక్షా కేంద్రాల ఆవరణ లో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్ లను ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మూసి ఉంచేలా చర్యలు చేపట్టాలని, పరీక్షా కేంద్రాలకు ప్లైయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేసి, పరీక్షల నిర్వహణ పై నిఘా వుంచాలని రెవిన్యూ , పోలీస్ అధికారులకు ఆదేశించారు. పరీక్ష సమయానికి విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా అన్ని మండలాలకు బస్సు సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. విద్యార్థుల వద్ద ఉండే ఎలక్ట్రానిక్ పరికరాలు (ఫోన్లు, వాచ్ లు) హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్నారు. హాల్ టికెట్ నెంబర్లను పరీక్షా కేంద్రాలలోని నోటీసు బోర్డు లో డిస్ప్లే చేయలన్నారు. పరీక్ష నిర్వహణ అనంతరం సమాధానపత్రాలను సీల్ చేసి పోస్టల్ ద్వారా తరలించే ప్రక్రియ పకడ్భందిగా చెపట్టాలని ఆదేశించారు.
సమావేశం లో అర్.డి. ఓ.జగదీశ్వర్ రెడ్డి,జిల్లా ఇంటర్మీడియట్ అధికారి దస్రు నాయక్,జిల్లా రవాణా అధికారి సురేష్ రెడ్డి,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండల్ రావు జిల్లా ఎగ్జామి నేషన్ కమిటీ సభ్యులు భాను నాయక్,నరేందర్ కుమార్,ఇస్మాయిల్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మే 6 నుండి 24 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీ గా నిర్వహించాలి:అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్

Share This Post