పదవతరగతి ప్రత్యేక తరగతులు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు తక్కువ సమయం ఉన్నందున,ప్రత్యేక తరగతులలో ఉపాధ్యాయులు బోధించిన అంశాలు విని శ్రద్ద గా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ నల్గొండ పట్టణం లో అర్.పి.రోడ్డు లో ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ను తనిఖీ చేసి పదవ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్ధి నులతో మమేకమై పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం అవుతున్నారు. ప్రశ్న పత్రాలు ఏ విధంగా వస్తాయి.ప్రశ్నల కు ఛాయిస్ వుంటుందా తదితర విషయాలు అడిగి వారు చెప్పిన సమాధానాలతో సంతృప్తి చెందారు.తరగతి గది లో శ్రద్ధగా ఉపాధ్యాయులు చెప్పినా విషయాలు వింటూ చదివి నోట్ చేసుకోవాలని అన్నారు తల్లి దండ్రులు తమ పై వుంచిన నమ్మకం నిల బెట్టుకుని పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని కలెక్టర్ సూచించారు.కలెక్టర్ వెంట ఎం. ఈ ఓ నర్సింహ,జిల్లా కామన్ బోర్డ్ సెక్రెటరీ కె.శ్రీనివాస్ లు ఉన్నారు.

పదవతరగతి ప్రత్యేక తరగతులు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*

Share This Post