పదవ తరగతి, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలి ….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

పదవ తరగతి, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలి ….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

మహబూబాబాద్, జూలై -22:

జిల్లాలో పదవ తరగతి, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక పదవ తరగతి, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్థేశించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 1 నుంచి ఆగస్టు 8 వరకు ఉదయం ఇంటర్ సప్లిమెంటరీ ప్రథమ సంవత్సర పరీక్షలు, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నందున జిల్లాలో ఏర్పాటు చేసిన (16) పరీక్షా కేంద్రాల్లో మొదటి సంవత్సరం 3192 మంది, ద్వితీయ సంవత్సరం 1793 మంది మొత్తం 4985 మంది పరీక్షలు రాస్తున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్, ఫ్లయింగ్ స్క్వాడ్, ఇన్విజిలేటర్ నియామకం, తదితర ఏర్పాట్లను చేయాలని తెలిపారు.

విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టిసి బస్సులు నడపాలని, పరీక్షా పత్రాలను నిల్వజేయుటకు పోలిస్ స్టేషన్ లలో ఏర్పాట్లు చేయాలని, ప్రశ్నపత్రాలకు పోలిస్ బందొబస్తు కల్పించాలని, పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల్లో పరీక్షా సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, జిరాక్స్ సెంటర్లు పరీక్ష సమయంలో మూసివేసేలా చర్యలు తీసుకోవాలని, 144 సెక్షన్ విధించాలని ఆయన సూచించారు.

ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ సప్లిమెంటరీ మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2-30 నుండి 5-30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అలాగే ఆగస్ట్ ఒకటి నుండి 10 వరకు ఉదయం 9-30 నుండి 12-45 సమయంలో పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో 4 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నన్నమని, మహబూబాబాద్ లో రెండు, తొర్రూరు, మరిపెడ లో ఒక పరీక్షా కేంద్రంలో మొత్తం 867 మంది పరీక్షలకు హాజరు కానున్నారు అని తెలిపారు.

రెండు పరీక్షలు ఒకే తేదీల్లో నిర్వహిస్తున్న సందర్భంలో ఇబ్బందులు రాకుండా సమన్వయంతో పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ఏ.ఎస్పీ యోగేష్ గౌతం, అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, ఇంటర్ మీడియెట్ విద్యా శాఖాధికారి సత్యనారాయణ, జిల్లా విద్యా శాఖ అధికారులు, ఎన్.పి.డి.సి.ఎల్. అధికారి నరేష్, మునిసిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, పోస్టల్ అధికారి సుధాకర్, టి.ఎస్.ఆర్టిసి అధికారి కల్పన, వైద్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post