పదవ తరగతి పరీక్షకు 9191 మంది విద్యార్థులు హాజరు – డి. ఈ. ఓ. ఎం.డి. అబ్దుల్ హై

ప్రచురణార్థం

పదవ తరగతి పరీక్షకు 9191 మంది విద్యార్థులు హాజరు – డి. ఈ. ఓ. ఎం.డి. అబ్దుల్ హై

మహబూబాబాద్, మే -23:

జిల్లాలో పదవ తరగతి పరీక్ష సోమవారం మొదటి రోజు ప్రశాంతంగా జరిగిందని, ప్రథమ భాష పరీక్షకు 9191 మంది హాజరు కాగా, 98 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యా శాఖాధికారి ఎం.డి.అబ్దుల్ హై నేడోక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో 9289 మంది పదవ తరగతి పరీక్ష రాయాల్సి ఉండగా, 9191 మంది విద్యార్థులు హాజరయ్యారని, జిల్లాలో మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని , ప్రశాంతంగా పరీక్ష జరిగిందని, 98 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, ఈ రోజు 98.94 శాతం హాజరయ్యారని తెలిపారు.

మొదటి రోజు జిల్లా కలెక్టర్ కె. శశాంక జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాల, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ ఫాతిమా ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారని డి.ఈ. ఓ. ఆ ప్రకటనలో తెలిపారు.

Share This Post