పదవ తరగతి పరీక్షలలో భాగంగా జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

పదవ తరగతి పరీక్షలలో భాగంగా జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

పరీక్ష కు 22,549 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా, 22,348 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 99.11 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. 201 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు వెల్లడించారు.

అదనపు కలెక్టర్ రాజర్షి షా ఒక పరీక్షా కేంద్రాన్ని,
ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు 34 కేంద్రాలను, జిల్లా విద్యాధికారి 5 పరీక్షా కేంద్రాలను సందర్శించి పరిశీలించినట్లు పేర్కొన్నారు.

Share This Post