- 5 .2022
పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం నాడు పరిక్షా కేంద్రాలను సందర్శించి విద్యా శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లా కేంద్రంలోని సుబదారి లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల,బాలసముద్రం లోని SR నేషనల్ హై స్కూల్ లలో నిర్వహిస్తున్న పదవతరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఏవరు కూడా మొబైల్ ఫోన్ లను తీసుకొని రాకుండా చూడాలని, విద్యార్థులు ఇన్విజిలేటర్లు కోవిడ్ నిబందనలను పాటిస్తూ మాస్క్ ను తప్పకుండా ధరించాలని అన్నారు. పరీక్షలకు హజరయిన విద్యార్థులకు తెలుగు, హింది మరియు ఉర్దూ మీడియంల వారిగా పశ్నాపత్రాలను సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట విద్యార్థులకు చల్లని త్రాగు నీరు అందుబాటులో ఉంచాలన్నారు. ఎండ తీవ్రత వల్ల విద్యార్థులు ఎవరు కూడ ఇబ్బందులకు గురికాకుండా పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థుల ఓయంఆర్ షీట్ మరియ పశ్నాపత్రాలను పరిశీలించారు. విద్యార్థులు పరీక్షా సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో డీ ఆర్ వో వాసు చంద్ర,తదితరులు పాల్గోన్నారు.