పదవ తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

పదవ తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

0 0 0 0

     

     జిల్లాలో మే23 నుండి నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ సోమవారం సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.

       జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్,  వాణి నికేతన్ బాలవికాస్ పాఠశాలల్లో నిర్వహిస్తున్న పదవతరగతి పరీక్షా కేంద్రాలను  జిల్లా కలెక్టర్ సోమవారం తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో  ఏవరు కూడా మొబైల్ ఫోన్ లను తీసుకొని రాకుండా చూడాలని,  విద్యార్థులు మరియు ఇన్విజిలేటర్లు కోవిడ్ నిబందనలను పాటిస్తూ మాస్క్  ను తప్పకుండా ధరించాలని అన్నారు.  పరీక్షలకు హజరయిన విద్యార్థులకు తెలుగు, హింది మరియు ఉర్దూ మీడియంల వారిగా పశ్నాపత్రాలను సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను  ఆదేశించారు. పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని, వేసవి దృష్ట విద్యార్థులకు చల్లని త్రాగు నీరు అందుబాటులో ఉంచాలన్నారు.   ఎండ తీవ్రత వల్ల విద్యార్థులు  ఎవరు కూడ ఇబ్బందులకు గురికాకుండా పరీక్షా కేంద్రాల వద్ద  మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయాలని సూచించారు.  ఈ సందర్బంగా విద్యార్థులతో కలెక్టర్  మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల  ఓయంఆర్ షీట్ మరియ పశ్నాపత్రాలను పరిశీలించారు.  విద్యార్థులు పరీక్షా సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

     ఈ సందర్భంగా కలెక్టర్ వెంట  జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్ రావు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

Share This Post