పదవ తరగతి లోపు చదువుకుంటున్న విద్యార్థులకు ప్రీమేట్రిక్ స్కాలర్ షిప్ కొరకు అర్హులైన విద్యార్థులందరికి కులం, ఆదాయం, స్థానిక ధ్రువ పత్రాలను యుద్ధ ప్రాతిపదికన జారీ చేయాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

పదవ తరగతి లోపు చదువుకుంటున్న విద్యార్థులకు ప్రీమేట్రిక్ స్కాలర్ షిప్ కొరకు అర్హులైన విద్యార్థులందరికి కులం, ఆదాయం, స్థానిక ధ్రువ పత్రాలను యుద్ధ ప్రాతిపదికన జారీ చేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తహశిల్దార్ లను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి అనంతరం అందరు ప్రత్యెక అధికారులు, తహసిల్దార్లు, ఆర్దిఒ లతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాటశాలల్లో పదవ తరగతి లోపు చదువుకుంటున్న విద్యార్థులందరికి ప్రిమేట్రిక్ స్కాలర్శిప్ పొందుటకు మండల విధ్యాదికారుల సహకారంతో వారికి కావల్సిన కులం, వార్షిక ఆదాయం, స్థానిక ధృవ పత్రాలను జారి చేయాల్సిందిగా ఆదేశించారు. విద్యార్థుల పూర్తి జాబితా తమ వద్ద ఉందని, వీరిలో ఏ తరగతిలో ఎ ఎ కులానికి సంబంధించిన ఎంత మంది విద్యార్థులు ఉన్నారో వివరాలు ఉన్నాయని, ఈ జాబితాకు సరిపోయే విధంగా ధృవీకరణ పత్రాల జారి ఉండాలని సూచించారు. ఇందుకు ఎం.ఇ.ఓ ల సహకారం తీసుకోవాలని, అదే విధంగా అర్హులైన విద్యార్థులు ప్రతి ఒక్కరు మీసేవ కేంద్ర,ములో దరఖాస్తు చేసుకునే విధంగా చూడాల్సిన బాధ్యతా ఎం.ఇ.ఓ లు తీసుకోవాలన్నారు. వి.ఆర్.ఓ. లను మీసేవ కేంద్రాలకు పంపించి రోజువారి దరఖాస్తులు సేకరించి ఎప్పటికప్పుడు ధృవీకరణ పత్రాలు జారి కావాలన్నారు. ప్రతి రోజు ఎన్ని పత్రాలు జారి చేసారో నివేదిక తనకు పంపించాలని సూచించారు. వారం రోజుల్లో ధృవీకరణ పత్రాలు జారి చేసే ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు.
జిల్లా అధికారులతో మాట్లాడుతూ ప్రతి వారం టూర్ ప్లాన్ శనివారం లోపల పంపించాలని, అనంతరం వారంలో పర్యటించిన గ్రామాలు అందులో గుర్తించిన ప్రభుత్వ పథకాల అమలు నివేదికను తయారు చేసి టూర్ డైరీ రూపంలో నివేదిక అందజేయాల్సిందిగా ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం వెబ్ నార్ లో లాగిన అయి కలేక్టరేటు లో పూర్తి అయినప్పుడు మాత్రమే లాగవుట్ కావాలని, అంతకన్నా ముందే లాగవుట్ అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
కలెక్టరేట్ ప్రజావాణి హాలులో అదనపు కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ రెవెన్యు పి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ రోజు మొత్తం 25 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి ఫిర్యాదు దారులకు సమాచారం ఇవ్వడంతో పాటు ఆన్లినే పోర్టల్ లో ఫిర్యాదు పరిష్కరించిన వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు కొంతమంది ప్రత్యెక అధికారులగా ఉండటంతో మండలాల్లో పాల్గొనగా మిగిలిన వారు ప్రజావాణి హాల్లో పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వార జారి.

Share This Post