పదవ తరగతి విద్యార్థులు పరిక్షలలో మంచి ఉత్తిర్ణత సాధించేలా ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రేరేపించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ హర్ష అన్నారు.

పత్రికా ప్రకటన                                                    తేది : 23-4-20 22

పదవ తరగతి విద్యార్థులు పరిక్షలలో మంచి ఉత్తిర్ణత సాధించేలా ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రేరేపించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ హర్ష అన్నారు.

శనివారం జిల్లా బాలభవన్ లో షెడ్యుల్డ్ కులాల, వెనుక బడిన తరగతుల , ఎస్టి సంక్షేమ శాఖల ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణ మరియు అవగాహన సదస్సు లో ముఖ్య అతిధిగాపాల్గొన్నారు.  జ్యోతి ప్రజల్వన గావించి కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ సందర్బంగా  అయన మాట్లాడతూ ఉద్యోగ దర్మం తో పాటు  విద్యార్తుల భవిష్యత్ ను తీర్చిదిద్దడానికి తల్లి తండ్రులతో పాటు ఉపాద్యాయులు మరియు వసతి గృహ వార్డెన్లుకృషి చేయాలనీ అన్నారు. ప్రతి   ఒక్క విద్యార్థికి పదవ తరగతి  పరీక్షలు రాయడం చాలా ముఖ్యమని, పదవ తరగతి పరిక్షలలో మంచి మార్కులు సాధిస్తేభవిష్యత్తు చాలా బాగుంటుందని, పదవ తరగతిలో వచ్చే                                                                                                                                                                       మా ర్కులు భవిష్యత్తు లో అన్ని చోట్ల ఉపయోగపడతాయని, ఐ.ఎ.ఎస్. లాంటి పెద్ద పెద్ద ఇంటర్వ్యూ లలో కూడా ముందుగా పదవ తరగతి మార్కులను చూస్తారని, విద్యార్థులు శ్రద్ధ తో చదువుకొని , పదవ తరగతి పరిక్షలలో మంచి మార్కులు సాధించడానికి కృషి చేయాలనీ అన్నారు. పదవ తరగతి సిలబస్ ను తగ్గించారని, ప్రశ్నలకు ఛాయస్ కుడా పెంచారని, పరీక్షలకు ఇంకా 25 రోజుల సమయం ఉన్నందున  విద్యార్థులు ప్రణాళిక తో చదివితే మంచి ఉత్తిర్ణత సాధించవచ్చని తెలిపారు. ఉపాధ్యాయులు పదవ తరగతి విద్యార్థులకు  ప్రత్యేక తరగతులు, రివిజన్ టెస్ట్ లు నిర్వహించి, ఇంగ్లీష్, మాథ్స్, సైన్స్ సబ్జెక్ట్ ల పై దృష్టి సారించి , విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలనీ, పదవ తరగతి పరిక్షలలో జిల్లాలో వంద శాతం ఉత్తిర్ణత సాధించేలా ఉపాధ్యాయులు, విద్యార్థులు కృషి చేయాలనీ కోరారు.

అనంతరం ఎస్సి సంక్షేమ శాఖ అద్వర్యం లో ఎస్సి, బి.సి, ఎస్టి  వసతి గృహ విద్యార్థులకు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ మరియు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ల జీవిత చరిత్ర   పై నిర్వహించిన వ్యాస రచన పోటిలలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికేట్లను మరియు నగదు బహుమతులను అందజేశారు. ప్రీ మెట్రిక్ వసతి గృహలలో మొదటి ర్యాంక్  సాధించిన పి.వెంకటేష్, 9 వ తరగతి , రామాపురం విద్యార్థికి 5000/-రూ. క్యాష్ ప్రైజ్ ను, రెండవ ర్యాంక్ సాధించిన కె.రమ్య, పదవ తరగతి, ఆలంపూర్ విద్యార్థికి 3000/-రూ. క్యాష్ ప్రైజ్ ను, మూడవ ర్యాంక్  సాధించిన జి.పవన్, 9 వ తరగతి, గద్వాల్ విద్యార్థికి 2000/- రూ.క్యాష్ ప్రైజ్ ను అందజేసారు. పోస్ట్ మెట్రిక్ వసతి గృహా విద్యార్థులలో  మొదటి ర్యాంక్ సాధించిన కె.వినోద్, బి.ఎ, మూడవ సంవత్సరం, ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహం, గద్వాల్ విద్యార్థికి 10,000/- రూ., రెండవ ర్యాంక్ సాధించిన జి.సాయి చరణ్య పాలిటెక్నిక్, రెండవ సంవత్సర, ప్రభుత్వ కళాశాల బాలికల వసతి గృహం, గద్వాల్ విద్యార్థికి 7000/- రూ., మూడవ ర్యాంక్ సాధించిన కట్రవత్ రోహిత్, పాలిటెక్నిక్ రెండవ సంవత్సరం, ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహం, గద్వాల్ విద్యార్థికి 5000/- రూ., క్యాష్ ప్రైజ్ లను అందజేసారు.

కార్యక్రమం లో ఎస్సి, బి.సి సంక్షేమ శాఖల అధికారిణి శ్వేత ప్రియదర్శిని, ఎ.ఎస్.డబ్లు.ఓ సరోజ, ఉపాధ్యాయులు మాథ్స్ కృష్ణ, బయో సైన్స్ వెంకన్న, నాగరాజు,  సిబ్బంది, ఎస్సి.బి.సి., ఎస్టి వసతి గృహాల విద్యార్థిని, విద్యార్థులు, వార్డెన్లు  సంబంధిత అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది.

Share This Post