పది రోజుల్లోగా ధాన్యం కొనుగోలు పూర్తి కావాలి – జిల్లా కలెక్టర్ హరీష్

పది రోజుల్లోగా ధాన్యం కొనుగోలు పూర్తి కావాలి  – జిల్లా కలెక్టర్ హరీష్

పది రోజులలోగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయుటకు అన్ని చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో సంబంధిత అధికారులు, రైస్ మిల్లుల యజమానులు, ట్రాన్స్పోర్టర్ ల తో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి సమీక్షిస్తూ జిల్లాలో 375 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 27,591 మంది రైతుల నుండి 249 కోట్ల విలువ గల 1,27,254 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 1,20,536 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడంతో పాటు 5,649 మంది రైతుల ఖాతాలో 61 కోట్లు జమ చేశామని అన్నారు. మిగిలిన ధాన్యాన్ని ఈ పది రోజులలో కొనుగోలు చేసే విధంగా కార్యాచరణతో ముందుకు సాగాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రత్యేక బృందాలు, తహసీల్ధార్లు, మండల ప్రత్యేకాధికార్లు రోజు 3,4 కేంద్రాలు సందర్శించి ఎక్కడ సమస్య ఉన్న పరిష్కరిస్తూ సమాచారాన్ని వెంటనే చేరవేయాలని కోరారు. ప్రధానంగా లారీల కొరత వేధిస్తున్నదని, ట్రాన్స్పోర్టర్ లతో మాట్లాడి కొనుగోలు కేంద్రాలకు, రైస్ మిల్లులకు లారీల మ్యాపింగ్ చేసి ఆ లారీలు ఎక్కడ ఉన్నాయో గమనిస్తూ త్వరగా ధాన్యం మిల్లులకు తరలించేలా చూడాలన్నారు. జిల్లాలో రెండు ట్రాన్స్పోర్టర్ లు సుమారు వేయి లారీలు ఏర్పాటు చేయవలసి ఉండగా లారీల కొరత తీవ్రంగా ఉండడం వల్ల కేంద్రాల నుండి ధాన్యం తొందరగా తరలించలేకప్లోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ధాన్యం తూకంలో రైతులు నష్ట పోతున్నారని నిఘా వర్గాల ద్వారా సమాచారముందని ఆలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇలాంటి సంఘటనలపై ఏదేని సమాచార ముంటే రైతుల నుండి ఫిర్యాదులు స్వీకరించి తెలుపవలసినదిగా వ్యవసాయ విస్తరణాధికారులకు సూచించారు.
కాబట్టి లారీలు రైస్ మిల్లులో లేదా కొనుగోలు కేంద్రంలో ఉండాలని లేకుంటే డబ్బులు చెల్లించామని, ఆర్.ఆర్. ఆక్ట్ క్రింద చర్య తీసుకుంటామని లారీల యజమానులని హెచ్చరించారు. అదేవిధంగా రైస్ మిల్లుల యజమానులు హమాలీలలను ఎక్కువ సంఖ్యలో పెట్టుకొని ధాన్యం డౌన్ లోడ్ చేసుకోవాలని, వాహనాలను వైటింగ్ లో పెట్టరాదని సూచించారు. ధాన్యం భద్రపరచుటకు స్థలాభావం వల్ల ఎవరైనా మూడు మాసాలకు భద్రపరచుకుంటే అద్దె చెల్లిస్తామని రైస్ మిల్లుల అధ్యక్షులకు సూచించారు. గన్ని బ్యాగుల కొరతను అధిగమించుటకు బ్యాగులు తెప్పిస్తున్నామని అన్నారు.
ఈ సమావేశంలో, జిల్లా పరిషద్ సి.ఈ.ఓ. శైలేష్, డి.ఎస్.ఓ. శ్రీనివాస్, ఆర్.డి.ఓ. సాయి ;రామ్, డి.ఆర్.డ్డి.ఏ. అదనపు ఫై.డి. భీమయ్య, జిల్లా వ్యవసాయాధికారి పరశురామ్ నాయక్, డి.సి.ఓ. కరుణ, మునిసిపల్ ఛైర్మెన్ చంద్రపాల్, ఫ్యాక్స్ చైర్మన్లు, రియాస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post