పదోవ తరగతిలో చూపించే ప్రతిభ జీవితంలో మంచి స్థానం పొందేందుకు కారణం అవుతుంది – స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి

పదోవ తరగతిలో చూపించే ప్రతిభ జీవితంలో మంచి స్థానం పొందేందుకు కారణం అవుతుంది – స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి

విద్యార్థి భవిష్యత్తుకు పదో తరగతినే పునాది

పదవ తరగతి విద్యార్థులు అనవసరమైన భయాందోళనలకు గురి కాకుండా ప్రశాంతంగా చదివి మంచి మార్కులు సాధించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి అన్నారు.
ఇందుకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రేరణ తరగతులను వినియోగించుకోవాలని కోరారు.
శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని లహరి గార్డెన్ లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వసతి గృహాలలోని పదవ తరగతి విద్యార్థులకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ప్రేరణ తరగతులను ఆయన జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
అనంతరం విద్యార్థులను ఉద్దేశించి అదనపు కలెక్టర్ మాట్లాడుతూ……
విద్యార్థుల్లో పరీక్షల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టేందుకు, పరీక్షలకు ఎలా తయారు కావాలో తాను స్వయంగా సివిల్స్ పరీక్షల్లో అవలంబించిన దినచర్యలు, అమలుపరిచిన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు.
తను కూడా హాస్టల్లో చదువుకుంటూ ఈ స్థాయికి వచ్చాను విద్యార్థులకు వివరించారు.
పరీక్షలు అంటే భయాలను తొలగించేందుకు ప్రభుత్వం తరఫున ప్రేరణ తరగతులను నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.
విద్యార్థులు పరీక్ష లంటే అనవసరంగా భయాందోళనలకు , ఒత్తిడికి లోనుకాకుండా బాగా చదివి మంచి మార్కులు పొందాలని అన్నారు.
పదవ తరగతిలో పొందిన ప్రతిభ ఆధారంగా భవిష్యత్తులో మంచి స్థానం పొందవచ్చన్నారు.
వసతి గృహాల్లో ఇచ్చిన మెటీరియల్ ను బాగా చదివి సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని, ముఖ్యంగా పేద విద్యార్థులకు ఉచిత విద్య తోపాటు, హాస్టల్ వసతి, ఉద్యోగాలు పొందేందుకు అభ్యర్థులకు ఉచిత శిక్షణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని తెలిపారు .
వీటితో పాటు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నదని, ప్రస్తుతం ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగిందని, ప్రభుత్వంతోపాటు, ప్రైవేటు లో కూడా ఎన్నో ఉద్యోగావకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో రాణించేలా మంచి ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందాలని అన్నారు.
విద్యార్థులు ఎస్ఎస్సి లో మంచి ఫలితాలు పొందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి కి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సహకారం అందించాలని, నిష్ణాతులైన ఉపాధ్యాయుల సూచనలతో ప్రేరణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
విద్యార్థులు మిగిలిన 22 రోజుల సమయాన్ని వృధా చేయకుండా పరీక్షల పైనే దృష్టి సారించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శ్రీధర్ జి, నిష్ణాతులైన సబ్జెక్ట్ ఉపాధ్యాయులు వివిధ హాస్టల్ వార్డెన్లు, 20 వసతిగృహాల్లో పదోతరగతి చదువుతున్న 340 మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post