పద్మశ్రీ , పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డు ల కోసం దరఖాస్తుల ఆహ్వానం…. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

పద్మశ్రీ , పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డు ల కోసం దరఖాస్తుల ఆహ్వానం….
జిల్లా కలెక్టర్ హనుమంతరావు

కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ 2023 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పద్మ అవార్డుల కొరకు నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా గౌరవప్రధమైన పద్మ అవార్డులను అందజేయడం జరుగుతుందన్నారు. కళలు, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ మరియు ఇతర రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి పద్మ అవార్డుకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. సంబంధిత మార్గదర్శకాలను http://padmaawards.gov.in వెబ్సైట్ లో చూడవచ్చని పేర్కొన్నారు.

సంబంధిత రంగాలలో విశేష కృషి చేసిన సంగారెడ్డి జిల్లాకు చెందినవారు అవసరమైన పత్రాలను జతపరిచి, ఈ నెల 19 వ తేదీ లోగా సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ లో గల జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ సూచించారు.

ఆసక్తిగల జిల్లాకు చెందిన వారు సంబంధిత రంగాల్లో సాధించిన లక్ష్యాలను చేసిన కృషిని 800 పదాలకు మించకుండా వ్రాసి, దరఖాస్తు 3 ప్రతులతో పాటు సంబంధిత పేపర్ కట్టింగులు ఫోటోలను జతచేసి నిర్ణీత సమయంలోగా అందజేయాలని కలెక్టర్ సూచించారు.

మార్గదర్శకాల మేరకు అర్హత కలిగిన దరఖాస్తులను అవార్డు కొరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

Share This Post