పద్మ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

యదాద్రి భువనగిరి జిల్లా లోని వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికీ భారత ప్రభుత్వము పద్మశ్రీ, పద్మభూషణ్ మరియు పద్మవిభూషణ్ అవార్డులను ప్రధానం చేయనున్నందున సంబంధిత రంగాలలో సేవలు అందించిన వారు దరఖాస్తులు చేసుకోవాలని, ఎంపిక కాబడిన అభ్యర్థులుకు జనవరి 26, 2023 తేదీ నాడు ఢిల్లీ లో జరిగే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించు కొని రాష్ట్రపతి చేతుల మీదగా ఈ అవార్డులను అందచేయనున్నట్లు కే.ధనంజయనేయులు గారు, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి, యదాద్రి భువనగిరి జిల్లా వారు తెలియచేస్తున్నారు.
ఈ సందర్బంగా జిల్లా లో కళలు, సామజిక కార్యక్రమాలు, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ మరియు టెక్నాలజీ, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, లిటరేచర్, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసులు తదితర అంశాలలో సాధించిన లక్ష్యాలను చేసిన కృషిని 800 పదాలు మించకుండా ఈ నెల 19 లోపు సంబందిత website www.padmaawards.gov.in లో అందులో నమోదు చేసుకోగలరు. నమోదు చేసుకున్న సమాచారమును జిల్లా యువజన మరియు క్రీడాల అధికారి కార్యాలయంలో తెలియజేయగలరు.

Share This Post