పరకాల డివిజన్ కేంద్రంలో ఇంటెగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మణానికి స్టల సేకరణ జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు.

సోమవారం నాడు సాయంత్రం పరకాల డివిజన్ కేంద్రంలో పరకాల శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి తో కలసి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్కాల కేంద్రంలో ఇంటెగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మణానికి సి ఏం ఎస్ గోదమ్, డాగ్ బంగ్లా వద్ద నున్న స్తలాన్ని పర్షిలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న మార్కెట్ ను తనిఖీ చేసి, విక్రయదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ప్రసూతి , ఆరోగ్య కేంద్రం ను తనిఖీ చేశారు. ఆసుపత్రి లో నున్న పరికరముల గురించి వైద్య అధికారులు కలెక్టర్ కు వివరించారు. బాలింతలకు అంధిస్తున్నా చికిత్స గురించి ఆరా తిసారు. పరకాల డివిజన్ లో పాపులేషన్ పెరుగుతున్న దృశ్య మెరుగైన వైద్య సేవలు అంధించుటకు కావలసిన సదుపాయాలు సమకూర్చుటకు తనిఖీ చేయనైనదని కలెక్టర్ తేలిపారు.

అంతకుముందు వ్యవసాయ మార్కెట్ యార్డు లో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ పంపిణి కార్యక్రమాన్ని పరిశీలించారు. ఓమైక్రాన్ థర్డ్ వేవ్ వ్యాప్తి చెందక ముందే ప్రతి ఒక్కరు రెండు డోస్ ల వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని అన్నారు. ప్రక్కనున్న పి‌ఏసిం‌ఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, ట్యాబ్ లో ధాన్యం నమోదు వివరాలు సరిగా చేయాలని, అన్ని కేంద్రాలలో కరోనా నిబంధనలు పాటించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంద్యారాణి, పరకాల మున్సిపాల్ చైర్మెన్ అనిత, కమిషనర్ శేషు, ఏ ఏం సి సారంగపాణి, పి‌ఏసిా‌ఎస్ చైర్మెన్ నాగయ్యా, ఏ డి సర్వేల్యాండ్ ప్రభాకర్, డీసీఓ ఇంచార్జ్ నీరజ, వైద్య అధికారులు, pacs సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post