పరిపూర్ణమైన ఓటర్ జాబితాను సిద్ధం చేయండి- రాష్ట్ర ఎన్నికల సీఈఓ శశాంక్ గోయల్.

సెప్టెంబర్ 18, 2021ఆదిలాబాదు:-

పరిపూర్ణమైన ఓటర్ జాబితాను సిద్ధం చేయాలనీ రాష్ట్ర ఎన్నికల సీఈఓ శశాంక్ గోయల్ అన్నారు. శనివారం రోజున జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్లతో 2022 ప్రత్యేక ఓటర్ నమోదు, పెండింగ్ ఫారాలు, ఈ ఎపిక్ కార్డు లు, స్వీప్ కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, 2022 ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పిదాలు లేకుండా సిద్ధం చేయాలనీ కలెక్టర్లను ఆదేశించారు. అదేవిధంగా కొత్తగా ఓటర్ గా నమోదు అయ్యేందుకు సమర్పించిన ఫారాలు, మార్పులు, చేర్పులకు సంబందించిన ఫారాలను పరిశీలించి చర్యలు చేపట్టాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్ గా వారి పేరు నమోదు చేసుకునేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ ఎపిక్ కార్డు లను డౌన్లోడ్ చేసుకొని సంబంధిత ఓటర్ కు అందజేయాలని సూచించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, జిల్లాలో పరిపూర్ణమైన ఓటర్ జాబితాను సిద్ధం చేయడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులు, సవరణలకు సంబంధించినవి 152 ఫారాలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హత గల వారందరిని ఓటర్ గా నమోదు చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఆర్డీఓ రాజేశ్వర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, ఎన్నికల విభాగం నాయబ్ తహసీల్దార్ మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post