పరిపూర్ణ ఓటరు జాబితా సిద్ధం చేయాలి..శశాంక్ గోయల్

పరిపూర్ణ ఓటరు జాబితా సిద్ధం చేయాలి..శశాంక్ గోయల్

2022 జనవరిలో ఓటరు తుది జాబితా ప్రకటించే నాటికి ఎలాంటి తప్పిదాలు లేకుండా పరిపూర్ణమైన జాబితా సిద్ధం చేయవలసినదిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయెల్ జిల్లా కలెక్టర్ లకు సూచించారు. శనివారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఓటరు జాబితాలో ఎలాంటి లాజికల్ తప్పులు లేకుండా, ఓటరు సవరణ, మార్పులు చేర్పులు వంటివి చేపట్టి ఈ నెల 30 లోగా పరిష్కరించాలని సూచించారు. నవంబర్ నాటికి డ్రాఫ్ట్ పబ్లికేషన్ జారీ చేసేముందే చనిపోయిన, డూప్లికేట్ ఓటర్ల పేర్లు తొలగించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలను రేషనైలేజేషన్ చేస్తూ ఒక పోలింగ్ కేంద్రంలో 1500 లకు పైగా ఓటర్లు ఉంటె అదనంగా మరో పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు గుర్తించాలన్నారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా గ్రామా స్థాయి వరకు ఓటరు నమోదుపై ప్రజలకు అవగాహన కలిగించాలని కలెక్టర్లకు సూచించారు.
ఓటరు జాబితాలో తప్పొప్పుల సవరణ, మార్పులు చేర్పులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, ఎటువంటి దరఖాస్తులు పెండ్డింగులో లేవని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ తెలిపారు. రేషనలైజెషన్ లో భాగంగా జిల్లాలోని రెండు శాసనసభ నియోజక వర్గ పరిధిలో కొత్తగా పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత లేదని తెలిపారు. ఓటరు ఈ- ఎపిక్ కార్డులకు సంబంధించి 1636 మంది దరఖాస్తు చేసుకోగా 949 మంది కార్డులను డౌన్ లోడ్ చేసుకున్నారని, మిగతా ఓటర్లు కార్డులు డౌన్ లోడ్ చేసుకోవలసిందిగా సమాచారం అందిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఎపిక్ కార్డు పోయిన, పాడైపోయిన వాటికి సంబంధించి 387 దరఖాస్తులు రాగా 33 పెండింగులో ఉన్నాయని వాటిని త్వరలో పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇవిఎం. వివిపాట్ లను భద్రపరచుటకు ఏర్పాటు చేసిన గోదాములో అదనంగా ఒక హాలు నిర్మించుటకు 53 లక్షలతో పంపిన ప్రతిపాదనలు మంజూరు చేయవలసినదిగా కలెక్టర్ కోరారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ రాబోయే తరం ఓటర్లు అనగా 17, 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నత పాఠశాలలు, కళాశాలలో చదువుచున్న విద్యార్థిని,విద్యార్థులు ఏ ఒక్కరు మిగిలిపోకుండా ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా అవగాహన కలిగించాలని సూచించారు. అందుకనుగుణంగా పాఠశాల,కళాశాలలో ఎలక్టోరల్ లిటరసి క్లబ్ కార్యకలాపాలు చురుకుగా కొనసాగించాలని సూచించారు. ప్రతి ఓటరు ఓటు హక్కు విలువను, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తెలుసుకొని నైతిక భాద్యతగా ఓటు వేసేలా అవగాహన కలిగించాలని స్వీప్ నోడల్ అధికారి రాజి రెడ్డి కి సూచించారు. ఇందుకు సంబంధించి భారత ఎన్నికల సంఘం చక్కగా తెలుగులో ఓటేద్దాం రండి పేరున చిన్న పుస్తకం ముద్రించిందని ఏది ఎంతో ఉప యుక్తంగా ఉందని, అన్ని లిటరసీ క్లబ్ లకు అందించి ఓటు మహత్యం తెలియజేస్తూ నిర్భయంగా, సురక్షితంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసే విధానంపై విద్యార్థులలో అవగాహన కలిగించాలని సూచించారు. అదేవిధంగా ఎన్నికల సంఘం బూత్ స్థాయి అధికారులకు ఉపయుక్తంగా రూపొందించిన మొబైల్ గరుడ యాప్ పై త్వరలో బూత్ స్థాయి అధికారులకు శిక్షణ ఇస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా గోడ పత్రిక, పుస్తకాలను ఆవిష్కరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రమేష్, ఆర్.డి.ఓ. సాయిరాం, స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Share This Post