పరిశుభ్రతను పాటించాలి జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి
శనివారం జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి జిల్లా కేంద్రం లోని టీచర్స్ కాలనీ లో గల మార్కెట్ లైన్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
పాఠశాలలో పారిశుధ్యమ్ లోపించడంపై ఆగ్రహం వ్యక్తపరిచారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నందున నీటి నిల్వ ఉండకుండా చూడాలన్నారు. నిల్వ ఉండడం వలన దోమలు ప్రభావిల్లే అవకాశాలు లేకపోలేదని ఎప్పటికి అప్పుడు శుభ్రపరచాలన్నారు. ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు చేరుకోవలన్నారు. పాఠశాలల పట్ల పర్యవేక్షణ పెంచాలని ఉపాధ్యాయులందరూ కూడా బాధ్యతతో వ్యవహరించాలన్నారు.
ఈ కార్యక్రమం లో విద్యాసాగర్, శ్రీనివస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.