పరిశుభ్రత, ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పర్చుకునేందుకు “డ్రై డే” కార్యక్రమాలు ముమ్మరంగా జరగాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పేర్కొన్నారు. మంగళవారం కామేపల్లి, కారేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో కలెక్టర్ పర్యటించి “డ్రై డే” కార్యక్రమాలను తణిఖీ చేసారు.

ప్రచురణార్ధం.

 ఆగష్టు 10 ఖమ్మం

పరిశుభ్రత, ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పర్చుకునేందుకు “డ్రై డే” కార్యక్రమాలు ముమ్మరంగా జరగాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పేర్కొన్నారు. మంగళవారం కామేపల్లి, కారేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో కలెక్టర్ పర్యటించి “డ్రై డే” కార్యక్రమాలను తణిఖీ చేసారు. ఇంటింటికి తిరిగి పరిశుభ్రత పనులను కలెక్టర్ తణిఖీ చేసి నివాసితులకు అవగాహన కల్పించారు. ఇంటితో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటిముందు మురుగు కాల్వలలో చెత్తా చెదారం వేయరాదని, తద్వారా దోమలు వ్యాప్తి చెంది సీజనల్ వాధ్యులు ప్రభలుతాయని కలెక్టర్ ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ఇండ్లలో నిరుపయోగంగా ఉన్న పాత్రలు, సీసాలు, టైర్ల వంటి వాటిలో నీటి నిల్వలు లేకుండా చూడాలని, వినియోగంలో లేని వాటిలో వర్షాల వల్ల నీరు నిలుస్తుందని వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని కలెక్టర్ సూచించారు. కారేపల్లి మండలం మాదారం గ్రామంలో “డ్రై డే” కార్యక్రమాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పలు ఆవాసాలు: అశుభ్రంగా ఉండడం, టైర్లలో నీటి నిల్వలు ఉండటం గమనించి స్వయంగా నీటి నిల్వలను తొలగింప చేసారు. ప్రతి మంగళవారం, శుక్రవారం రెండురోజుల పాటు గ్రామాలలో, పట్టణాలలో తప్పనిసరిగా “డ్రై డే” కార్యక్రమాలు జరగాలని, పారిశుధ్య పనులను ముమ్మరం చేయాలని, నీటి నిల్వలను తొలగిచుకోవడంతో పాటు బ్లీచింగ్, స్ప్రేయింగ్, ఫాగింగ్ పనులు క్రమం తప్పకుండా జరగాలని గ్రామ పంచాయితీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలో కోవిడ్ పాజిటీవ్ నుండి కోలుకున్న వారి ఇండ్లకు వెళ్ళి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ వ్యాప్తి నుంచి తమను తాము రక్షించుకోవాలని, ప్రధానంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని, వైద్యాధికారుల సూచన మేరకు క్రమం తప్పకుండా వైద్యసేవలు పొందాలని కలెక్టర్ సూచించారు. గ్రామంలో మౌస్క్ ధరించని వారిపై నెయ్యి రూపాయలు జరిమాన విధించాలని గ్రామ పంచాయితీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

అంతకు ముందు రఘునాథపాలెం మండలం కోయచేలక బైపాస్ యాపిల్ రోడ్ కూడలిలో ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. అదేవిధంగా కామేపల్లి మండలం ముచ్చర్లలో బృహత్ పల్లె ప్రకృతి వనానికి గుర్తించిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించి మొక్కలు నాటారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు సత్వర చర్యలు ఉండాలని గుర్తించిన స్థలాల్లో గుంతల త్రవ్వకం పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.  బూడిదంపాడు నర్సరీని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, డి.ఎం.ఓ. ఉషశ్రీ, తహశీల్దారు పుల్లయ్య, పంచాయితీ కార్యదర్శి నరేష్, ఎం.పి.డి.ఓ. రమాదేవి, గ్రామ సర్పంచ్ నరేష్, రఘునాధపాలెం సర్పంచ్ గుడిపుడి శారద, ఎం.పి.ఓ శాస్త్రి, ఎం. పి.డి.ఓ, కార్యదర్శి మధు, సర్పంచ్ మీరాసాహేబ్, కామేపల్లి ఏ.పి.ఓ రాణి, కార్యదర్శి మహేష్, ఎం.పి.డి.ఓ శీలాసాహెబ్, తహశీల్దారు జి.ప్రసాద్, ఎం.పి.ఓ. వెంకటసత్యనారాయణ, సర్పంచ్ కె. లూసి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post