పరిశ్రమల దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

జిల్లాలో జెత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ పరిశ్రమల స్థాపన కొరకు చేసుకున్న దరఖాస్తులను నిర్జీత గడువులోగా పరిశీలించి అనుమతించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో టి.ఎస్‌-ఐపాస్‌ ద్వారా వివిధ శాఖలు అందజేయు అనుమతులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపన కోసం దరఖాస్తు చేసుకున్న వాటిని పరిశీలించి టి.ఎస్‌. -ఐ.పాస్‌ ద్వారా నిర్ధేశిత గడువులోగా ఖచ్చితంగా అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడంతో పాటు అనుమతులు పొందిన పరిశమలలో స్థానికులకు ఉపాధి కల్పించే విధంగా చూడాలని సూచించారు. టి-పైద్‌ పథకం ద్వారా ఎస్‌.సి., ఎస్‌.టి.లకు సంబంధించిన 11 పెట్టుబడి రాయితీ దరఖాస్తులను ఆమోదిస్తూ 31.47 లక్షల రూపాయలు, గిరిజనులకు సంబంధించి 4 పెట్టుబడి రాయితీ దరఖాస్తులను ఆమోదిస్తూ 13.63 లక్షల రూపాయలు, ఎస్‌.సి., ఎస్‌.టి.లకు సంబంధించిన 8 పావలా వడ్డీ రాయితీ దరఖాస్తులకు ఆమోదం తెలుపుతూ 1.61 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జి.ఎం. ఎం.హరనాథ్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ హవేలిరాజు, జిల్లా సాంఘిక
సంక్షేమాధికారి పి.రవీందర్‌రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post