పరిశ్రమల స్తాపనతోనే జిల్లా ఆర్ధిక ప్రగతి :: జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ప్రచురణార్థం

ఖమ్మం, జూన్ 6

పరిశ్రమల స్థాపన తోనే జిల్లా ఆర్ధిక ప్రగతి సాధిస్తుందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. జిల్లాల్లో 170 యూనిట్లకు స్థాపన సబ్సిడీ మంజూరు చేశామన్నారు. టి-ఎస్ ఐపాస్ క్రింద వివిధ శాఖలకు సంబంధించి అనుమతులకు 202 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇట్టి దరఖాస్తుల్లో 163 దరఖాస్తులు మంజూరు ఇవ్వగా, 22 దరఖాస్తులు తిరస్కరణ చేసినట్లు ఆయన అన్నారు. దరఖాస్తుదారులకు వారి వారి దరఖాస్తులో లోపాల విషయమై అవగాహన కల్పించి, ఆయా లోపాలను అధిగమించేలా చర్యలు చేపట్టాలన్నారు. దరఖాస్తులు నిర్ణీత సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

Share This Post