పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహం అందించాలి : జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్
————————
–
జిల్లాలో ఉపాధి కల్పన కోసం పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి అన్ని విధాలుగా ప్రభుత్వపరంగా ప్రోత్సహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా అదనపు కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ టీఎస్ ఐపాస్ కింద దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలన్నారు.
టి ఫ్రైడ్ క్రింద
రవాణా వాహనాల యూనిట్ ల మంజూరుకు బదులు
పరిశ్రమలను స్థాపిస్తే అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వచ్చే ఆస్కారం ఉన్నందున పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారిని అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ సూచించారు .
నర్మాల లోని ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులో రాబోయే పరిశ్రమల కోసం నీటి వసతి సహా, అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ మిషన్ భగీరథ , తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ అధికారులను ఆదేశించారు .
ఈ సందర్భంగా టీ ఫ్రైడ్ కింద రవాణా వాహనాలను కొనుగోలు చేసిన 8 మంది ఎస్సీ, 8 మంది ఎస్టీ లబ్ధిదారులకు రూ.47 లక్షల రాయితీ నిధులను మంజూరు చేశారు.
సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ వినోద్ , జిల్లా రవాణా అధికారి కొండలరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మాలోతు సుభాష్ , సెస్ ఏ డి ఈ రఘుపతి తదితరులు హాజరయ్యారు.