పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అనుమతులివ్వాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు.

________________________
పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అనుమతులివ్వాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి పరిశ్రమల అభివృద్ధి కమిటీ, టిఎస్ఐ పాస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన సమయంలో గా అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. సమయానికి మించి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచుకోవద్దని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో అన్ని దరఖాస్తులను సకాలంలోనే పరిష్కరించడంతోపాటు, సకాలంలో అనుమతులు ఇస్తుండటం పట్ల ఆయన అభినందనలు తెలిపారు .
ఈ సందర్భంగా టీఎస్ ఐపాస్ దరఖాస్తుల తో పాటు, టీ ప్రైడ్ కింద వచ్చిన దరఖాస్తులపై కూడా సమావేశంలో సమీక్షించారు.
జిల్లా పరిశ్రమల మేనేజర్ వి. బాబురావు, ఆర్టీవో నరేష్ ,జిల్లా ఫైర్ ఆఫీసర్ సుధాకర్, గ్రౌండ్ వాటర్ డి డి రాజేందర్ ,ఎల్డీఎం కే. భాస్కర్ ,పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి సాయి దివ్య, ఎస్సీ కార్పొరేషన్, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, డి టి డబ్ల్యూ చత్రు నాయక్, ఏటిఓ ప్రతాప్, ఏ సి టి ఓ ఖాజా నజీముద్దీన్, డిటిసిపిఓ శేఖర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
________________________

Share This Post