పరిశ్రమల స్థాపనకు శాఖల అధికారులు క్లియరెన్స్ ఇవ్వాలి..అదనపు కలెక్టర్లు రమేష్

పరిశ్రమల స్థాపనకు శాఖల అధికారులు క్లియరెన్స్ ఇవ్వాలి..అదనపు కలెక్టర్లు రమేష్

టి.ఎస్. ఐ పాస్ విధి విధానాలు, మార్గదర్శకాలకనుగుణంగా పరిశ్రమలు నెలకొల్పుటకు పెట్టుకున్న దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి అనుమతులు మంజూరు చేయవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్ లో ఏర్పాటుచేసిన జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ టి.ఎస్. ఐపాస్ క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన 1514 ధరఖాస్తులలో 24 దరఖాస్తులు వివిధ స్థాయిలలో పెండింగులో ఉన్నాయని అన్నారు. ప్రధానంగా కాలుష్య నియంత్రణ మండలి, టి.ఎస్.ఐ.ఐ.సి., విద్యుత్, కర్మాగారాలు,అగ్నిమాపక, గ్రౌండ్ వాటర్, హెమ్.ఏం.డి.ఏ. రెవిన్యూ శాఖాలలో క్లియరెన్స్, ఆమోదం నిమిత్తం ఆ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఆయా శాఖల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి తమ స్థాయిలో పెండింగు లేకుండా నిర్ణీత సమయంలో క్లియరెన్స్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా టి-ప్రైడ్ కార్యక్రమం క్రింద 9 మంది ఎస్సి, 37 మంది ఎస్టీ లకు 35 శాతం సబ్సిడీతో వాణిజ్య వాహనాలు లబ్ధిదారులకు అందించుటకు కమిటీ ఆమోదం తెలిపింది.
ఈ సమావేశంలో అదనపు జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణ మూర్తి, డి.పి .ఓ. తరుణ్ కుమార్, వారి.టి.ఓ. శ్రీనివాస్ గౌడ్, ఐ.ఐ.సి. ఈఓ కె.టి.నాయక్, హెమ్.ఏం.డి.ఏ. ప్లానింగ్ అధికారి నీలిమ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏ.ఈ. శిరీష, విద్యుత్ శాఖా సంతోష్, గ్రౌండ్ వాటర్ డి.డి., అగ్నిమాపక అధికారి తదితరులు పాల్గొన్నారు.

Share This Post