పరిశ్రముల అనుమతుల పై సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్


పరిశ్రమలకు అనుమతులను సకాలంలో అందించాలి:: అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
జిల్లాలో ఎగుమతులు ప్రోత్సహించేందుకు ప్రత్యేక కమిటి ఏర్పాటు
పారిశ్రామికాభివృద్ది సంబంధిత అంశాల పై అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్
పెద్దపల్లి, నవంబర్ 9:- జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం సకాలంలో అందజెయాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలో పారిశ్రామికాభివృద్ది, పరిశ్రమలకు అందించే ప్రోత్సాహకం అంశాల పై సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ జూం కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలలో ఉన్న పరిశ్రమ ప్రోత్సహక కమిటి ద్వారా జిల్లాలో ఏర్పాట చేయనున్న పరిశ్రమలకు వివిధ శాఖల ద్వారా జారీ చేయాల్సిన అనుమతులలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి సత్వరమే అనుమతులు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. అదే విధంగా జిల్లాలో 8 ఎస్సీ ఎస్టీ రవాణా యూనిట్ లకూ రూ21,97,214/- పెట్టుబడి రాయితీ ,3 యూనిట్ లకు 50868 వడ్డీ రాయితీ మంజూరు చేసారు. జిల్లాలో పరిశ్రమల ద్వారా ఎగుమతులను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లాను ఎగుమతుల హబ్ గా తీర్చిదిద్దే దిశగా కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులతో ప్రత్యేక సబ్ కమిటిని ఏర్పాటు చేసారని తెలిపారు. జిల్లాలో ఎగుమతులకు అనుకులంగా ఉన్న తగు ఉత్పత్తులను గుర్తించి, వాటి అభివృద్దికి ప్రభుత్వం తరంపున అవసరమైన సహయ సహకారాలు అందించే కార్యాచరణ సిద్దం చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం మరియు ప్రధాన మంత్రి ఆహార మైక్రో ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు పెండింగ్ దరఖాస్తుల వెంటనే మంజూరు చేయాలని సూచించారు.

   పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్,  ప్రాంతీయ రవాణా అధికారి , సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో  పాల్గొన్నారు.

Share This Post