జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి k. వనజ అంజనేయులు గౌడ్ గారు దామరగిద్ధ మండల పరిషత్ కార్యాలయాన్ని అకస్మిక తనిఖీ నిర్వహించారు.. మండల పరిధి లో జరుగుతున్నా అభివృద్ధి పనుల పురోగతిని ఎంపిడిఓ, పంచాయతీరాజ్ ఏఈ ,ఎంపిఓ లను అడిగి తెలుసుకున్నారు.. పెండింగ్ పనులను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. దామరగిద్ధ గ్రామంలోని కొత్తగా నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నీ పరిశీలించారు, పక్కనే ఉన్న అంగన్వాడి సెంటర్ ను తనిఖీ చేశారు,ఆహారం నాసికంగా ఉండడానికి చూసి అంగన్వాడి సిబ్బంది నీ మందలించారు, అంగన్వాడి పిల్లల హాజరు రిజిస్టర్ ను తనిఖీ చేశారు. ఆ తర్వాత కాన్ కుర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి, పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు,అలాగే 5 లక్షల రూపాయలు జడ్పీనిధులను వెచ్చించి నిర్మించిన స్కూల్ టాయిలెట్స్ ను, మరియు 5 లక్షల రూపాయల జడ్పీనిధులను వెచ్చించి నిర్మించిన స్కూల్ కాంపౌండ్ వాల్ ను పరిశీలించారు, స్కూల్ పరిధిలోని ఉర్దూ మీడియం స్కూల్ పరిశీలించారు మరియు పక్కనే ఉన్న అంగన్వాడి సెంటర్లో పిల్లలకు గుడ్లు ఇవ్వకుండా దాచిపెట్టినందుకు అంగన్వాడి ఆయను మందలించి, ఆ యొక్క గుడ్లను పిల్లలకు పంచిపెట్టించారు, అంగన్వాడి టీచర్ గైరు హాజరుకావడానికి గల కారణాన్ని వెంటనే నివేదిక అందించాలని జడ్పి సీఈఓ గారిని ఆదేశించారు.ఈ కార్యక్రమం లో జడ్పీ సీఈవో శ్రీమతి జ్యోతి గారు, ఎంపీపి శ్రీ బి.నర్సప్ప గారు, ఎంపిడిఓ శ్రీమతి శశికళ గారు, ఎంపీఓ రామన్న గారు ,పంచాయతీరాజ్ ఏఈ గారు, జిల్లా పరిషత్ సూపరిండెంట్ శ్రీ రామచందర్ రావు గారు , క్యాతన్‌పల్లి శ్రీ రాములు గారు , కాన్ కుర్తి zphs హెడ్మాస్టర్ శ్రీ విశ్వనాథం గారు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు