పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. జిల్లా కలెక్టర్ నిఖిల

పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, బట్ట సంచులను వినియోగించాలని జిల్లా కలెక్టర్ నిఖిల ప్రజలను కోరారు.

ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా స్వచ్ఛత ప్రచార రథంను జండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ చెత్తను అనాలోచితంగా ఎక్కడ పడితే అక్కడ వేయడం వలన దోమలు, ఈగలు ప్రాబలి డెంగీ, మలేరియా లాంటి వ్యాధులు వ్యాపించడమే కాకుండా పరిసరాలు అపరిశుభ్రంగా మారుతాయన్నారు. గ్రామాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత మనందరిదని అన్నారు. గ్రామాలలో ప్రతి ఇంటికి తడి, పొడి చేత్త వేరువేరుగా వేయడానికి రెండు రంగుల చేత్త బుట్టలు ఇవ్వడం జరుగుతందన్నారు. ప్రతిరోజు ఇంట్లో వెలువడే చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి మీ ఇంటి వద్దకు వచ్చే గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించాలన్నారు. ఇండ్లలో వాడిన నీటిని పరిసరాల్లో నిలువకుండ ఇంకుడు గుంతలు తప్పకుండ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముద్రించిన కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య (లోకల్ బాడీ), మోతిలాల్, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డి ఆర్ డి ఓ కృష్ణన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Share This Post