పరిసరాల పరిశుభ్రత తోనే సీజనల్ వ్యాధులు దూరం – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

పరిసరాల పరిశుభ్రత తోనే సీజనల్ వ్యాధులు దూరం – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

పల్లెల సర్వతోముఖాభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యమం – జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి

వంద రోజులు పూర్తి చేసిన ఇద్దరు ఉపాధి హామీ కూలీలను సన్మానించిన కలెక్టర్, జడ్పీ చైర్ పర్సన్

ఎటువంటి అంటు వ్యాధులు ప్రభల కుండా ఉండాలంటే గ్రామాల్లో పరిసరాలు పరి శుభ్రంగా ఉంచుకోవాలని, గ్రామ ప్రజల అందరి సమిష్టి కృషితోనే సాధ్యమని, జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు.
శనివారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా లింగాల మండలంలోని సూరాపూర్, మగ్ధూంపూర్,లింగాల గ్రామాలను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి తో కలిసి నిర్వహించిన గ్రామాల పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సురాపూర్ గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి ప్రకృతి వనం లోని పండ్లు, పూలు,వివిధ రకాల 3400 చెట్లను పరిశీలించి పల్లె ప్రకృతి వనం లో మొక్కలు నాటారు.
ఏడెకరాల ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్థలంలో సీతాఫల, నేరేడు, పనస, కానుగ వివిధ రకాల 4500 నాటిన మొక్కలను పరిశీలించారు.
అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల వివరాలను మన ఊరు మన బడి ద్వారా 15 లక్షల రూపాయలతో ఎంపిక చేసిన పనుల వివరాలను అధికారులు, ఉపాధ్యాయులతో అడిగి తెలుసుకున్నారు.
తరగతి గదులను పరిశీలించారు.
పాఠశాలలో మౌళిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.
మాగ్ధూంపూర్, లింగాల జిల్లా పరిషత్ పాఠశాలలను ఆయన సందర్శించారు.
మగ్ధూంపూర్ పాఠశాలలో మన ఊరు మన బడి చేపట్టాల్సిన పనుల వివరాలను పరిశీలించారు.
పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దిన ప్రధానోపాధ్యాయుడిని అభినందించారు.
అవార్డుకు ఎంపిక చేయాలని సూచించారు.
లింగాల జిల్లా పరిషత్ పాఠశాలను 1 కోటి 47 లక్షల తో మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా చేపట్టాల్సిన పనులను పరిశీలించారు.
100 సంవత్సరాల చరిత్ర కలిగిన లింగాల పాఠశాల కట్టడాలను దెబ్బతినకుండా ఆధునీకరించాలని సూచించారు.
అదేవిధంగా క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…
ఉపాధిహామీ కార్మికుల శ్రమతోనే పల్లె ప్రకృతి వనాలు, హరితహారం, తదితర పనులతో పల్లెల రూపురేఖలు మారాయన్నారు.
అందుకు కృషి చేసిన ఉపాధి హామీ కార్మికులను అభినందించారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, అపరిశుభ్రంగా ఉంటేనే సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయన్నారు.
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వర్తించి పిల్లలందరినీ ప్రభుత్వ బడిలోనే చేరే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి మాట్లాడుతూ….
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాలను నిర్వహిస్తూ..
ప్రతి గ్రామంలో పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డుల ఏర్పాటుప్రతి గ్రామానికీ నర్సరీ ఏర్పాటు, ప్రతి ఇంటికీ ఆరు మొక్కల పంపిణీ, హరితహారం కూలిపోయే, అవసాన దశలో ఉన్న ఇండ్లను కూల్చివేయడం, శిథిలాల తొలగింపుగ్రామాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్‌, కమ్యూనిటీ ప్లాంటేషన్‌, ఇన్‌స్టిట్యూషన్‌ ప్లాంటేషన్‌ షెడ్స్‌ నిర్మాణంచెత్త ఏరివేతకు, నీళ్లు పోయడానికి ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌ సమకూర్చడం, తడి, పొడిచెత్తను వేరుచేయడంకొత్త విద్యుత్తు స్తంభాలు, ఎల్‌ఈడీ లైట్లు, వీధిదీపాలకు మూడో వైరు ఏర్పాటు, శిథిల స్తంభాల తొలగింపు, వైర్లను సరిచేయడం జరుగుతుందన్నారు. గ్రామస్థుల భాగస్వామ్యంతో శ్రమదానంతో
గ్రామంలో చేయవలసిన పనులను గుర్తించి, గ్రామాభివృద్ధికి అవసరమైన ఆయా పనులను అందరి భాగస్వామ్యంతో చేయాలన్నారు.
గ్రామ పరిశుభ్రత పచ్చదనం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీ కి, గ్రామ ప్రజలకు ఆమె సూచించారు.
సురాపూర్ గ్రామంలో ఉపాధి హామీ లో వంద రోజులు పూర్తిచేసుకున్న బుచ్చయ్య, కృష్ణయ్య లను శాలువాతో కలెక్టర్, చైర్ పర్సన్ లు సత్కరించారు.
ఈ కార్యక్రమంలో డిపిఓ కృష్ణా, డిఆర్డిఓ నర్సింగ్ రావు, ఎంపీడీవో గీతాంజలి, ఆయా గ్రామాల సర్పంచులు లక్ష్మీ, హనుమంతయ్య, కోనేటి తిరుపతయ్య, కార్యదర్శులు లక్ష్మి, గ్రామాల ప్రజలు గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post