ప్రచురణార్ధం
ఆగష్టు 24 ఖమ్మం:
పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతామని, ప్రతి ఒక్కరు బాధ్యతగా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. మంగళవారం ఏన్కూరు మండలంలో పర్యటించి “డ్రై డే” కార్యక్రమాన్ని పరిశీలించి గృహనివాసులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఏన్కూరు గ్రామ పంచాయితీలో పనుల్లో నిర్లక్ష్యం కనబర్చిన గ్రామ కార్యదర్శికి షోకాజ్ నోటీసు ఇవ్వాల్సిందిగా జిల్లా పంచాయితీ అధికారిని ఆదేశించారు. నూకాలంపాడు గ్రామంలో ఆవాసాలను సందర్శించి ఇంటి ఆవరణలో అపరిశుభ్రంగా, వినియోగంలో లేని వస్తువులను ఇంటి ఆవరణలో వదిలివేయడం గమనించి ఇంటి యజమానికి జరిమాన విధించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ తమ ఇంటి ఆవరణలో నిరుపయోగంగా ఉండే వస్తువులలో నీరు నిల్వలు గమనించకపోవడం వల్ల వాటిలో లార్వా ఉత్పత్తి చెంది. దోమలు వ్యాప్తి చెందుతాయని మంచినీటిలో ఉండే దోమలు పగటి వేళ కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా సంక్రమిస్తున్నదని, ఇట్టి విషయాన్ని పౌరులందరు గమనించి తగు జాగ్రత్త చర్యలు పాటించి సీజనల్ వ్యాధుల బారీన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా యంత్రాంగం సీజనల్ వ్యాధుల పట్ల విస్తృత అవగాహన -కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. మండలంలో టైరు పంక్చర్ వేసే షాపులు ఎన్ని ఉన్నాయని, వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎన్ని నిర్వహించారు. కోవిడ్ వ్యాక్సిన్ వేయడం, తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పంక్చర్ షాపు యజమానులు స్పందించి పరిశుభ్రత పాటించని యెడల షాపులను బంద్ చేయించాలని కలెక్టర్ తెలిపారు. పంచాయితీ అధికారులు, వైద్యులు చెప్పిన జాగ్రత్తలను పౌరులందరూ. తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ నివాసితులకు సూచించారు. ప్రతిరోజు నిర్వహిస్తున్న “డై దే” కార్యక్రమాలలో మండల స్థాయి అధికారులందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏ.ఎన్.ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు ఇంటింటికి వెళ్ళి ఆరోగ్య సర్వే చేసి అట్టి సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥ మాలతి, మండల ప్రత్యేక అధికారి సంజయ్ కుమార్, జిల్లా మలేరియా అధికారి సంధ్య, వైద్యాధికారి శ్రీనివాస్, డా॥అల్తాఫ్, తహశీల్దారు ఖాసీం, ఎం.పి.డి.ఓ అశోక్, ఎం.పి.పి వరలక్ష్మీ, ఏన్కూరు గ్రామ సర్పంచ్ రుక్మిణి, నూకాలంపాడు గ్రామ సర్పంచ్ శేషగిరిరావు మండలస్థాయి. అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.