పరిసరాల పరిశుభ్రత మన అందరి భాద్యత :: జిల్లా కలెక్టర్ జి. రవి

పరిసరాల పరిశుభ్రత మన అందరి భాద్యత :: జిల్లా కలెక్టర్ జి. రవి

                                                        పరిసరాల పరిశుభ్రత మన అందరి భాద్యత  ::  జిల్లా కలెక్టర్ జి. రవి

      జగిత్యాల, అగస్టు 19: వర్షాకాలంలో వాతావరణంలో సంబంవించే మార్పుల వలన సీజనల్ వ్యాదులు రాకుండా మన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మరియు దోమల నియంత్రణ లో బాగంగా వారానికి రెండురోజులు డ్రైడేగా ఏర్పాటు చేసుకోని ఇంటి ఆవరణలో పరిశుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు.  గురువారం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని రామన్నపేట గ్రామంలో ఇంటింటికి తిరిగి పారిశుద్ధ్య, పరిసరాల పరిశుభ్రతలను పరిశీలించారు.  ఇంటి ఆవరణలో పనికిరాని కూలర్లు,  వాహానాల టైర్లను నిల్వ ఉంచడం, చెత్తచెదారాన్ని తొలగించకుండా వదిలివేయడం వలన డెంగ్యూ, మలేరియా వంటి వ్యాదులను విస్థరింపజేసే దోమలు తయారవుతాయని,  ఇంటి పరిసరాలలో నీరు నిలవడానికి అవకాశం ఉండే  పనికిరాని కూలర్లు, టైర్లు, ప్లాస్టిక్ పాత్రలు మరియు కోబ్బరిబోండాలు మొదలగు వాటిని గుర్తించి తోలగించాలని, ప్రతిరోజు కాకపోయిన, వారంలో రెండు రోజులను పరిసరాల పరిశుభ్రతకు కేటాయించాలని అన్నారు.  ప్రతి శుక్రవారం మరియు మంగళవారం డ్రైడే పాటించాలని పేర్కోన్నారు. రామన్నపేట గ్రామ ప్రారంభంలో రోడ్డుకు ఇరువైపుల చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్ సక్రమంగా నిర్వహించడం లేదని, వెంటనే ప్లాంటేషన్ చేయవలసిందిగా ఎంపీడీఓ ను ఆదేశించారు.  రామన్నపేట గ్రామంలో జ్వర లక్షణాలుతో బాధపడుతున్న వారి నుండి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కి పంపించాలని వైద్యాధికారికి తెలియచేశారు.  ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత, దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై  సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించాలని అన్నారు.  గ్రామాలు మరియు పట్టణాల్లో కరపత్రాలు, చెత్త సేకరణ వాహనాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు.  ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొని, వైద్య సేవలు మరియు అనుమానితులనుండి రక్త నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పంపించాలని అన్నారు.  జిల్లాలో ప్రతి రోజూ 100ఇండ్లను సర్వే చేయడానికి 10 మందిని నియమించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. డెంగ్యూ మలేరియా వచ్చిన వ్యక్తులకు పరిసర ప్రాంతాల్లో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ పర్యటనలో స్థానికసంస్థల అదనపు కలెక్టర్ శ్రీమతి జే. అరుణశ్రీ,  జిల్లా పంచాయతీ అధికా నరేష్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి పి. శ్రీదర్, ఎంపీటీసీ సఫియాబేగం, జడ్పిటిసి రాంమోహన్ రావు, తహసిల్దార్ శ్రీమతి సుజాత, ఎంపీడీవో శైలెజ, సర్పంచ్  జలజ, ఎంపీవో, పంచాయతీ సెక్రెటరీ ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయైనది

పరిసరాల పరిశుభ్రత మన అందరి భాద్యత :: జిల్లా కలెక్టర్ జి. రవి

పరిసరాల పరిశుభ్రత మన అందరి భాద్యత :: జిల్లా కలెక్టర్ జి. రవి

Share This Post