పరీక్షల నిర్వహణను పకడ్బందీగా పర్యవేక్షించాలి అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు చేపట్టాలి ……. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

 

పరీక్షల నిర్వహణను పకడ్బందీగా పర్యవేక్షించాలి

అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు చేపట్టాలి
……. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

 

ప్రస్తుత ఎండాకాలం లో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమం, కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో మరింత సమర్ధవంతంగా అమలు జరిగేలా చూడాలన్నారు.

శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో వివిధ అంశాలపై సి.ఎస్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

డబుల్ బెడ్ రూమ్ పథకంతో పాటు కంటి వెలుగు, ఆరోగ్య మహిళా, టెన్త్, ఇంటర్, డిగ్రీ వార్షిక పరీక్షల నిర్వహణ, పోడు భూములకు పట్టాల పంపిణీ, జీ.ఓ నెం.లు 58 , 59 , 76, 118 అమలు, హరితహారం, తదితర అంశాల ప్రగతిని సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు.

ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రదేశాలు, భవనాలు, వివిధ సంస్థలను గుర్తిస్తూ అగ్ని ప్రమాద నివారణకు సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించాలన్నారు.

ఆరోగ్య మహిళా, కంటి వెలుగు కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభిస్తోందని, వీటి ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన సేవలందేలా చొరవ చూపాలన్నారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని, వివరాలను ఆన్ లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలన్నారు.

తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ, మొక్కల సంరక్షణ, క్రమం తప్పకుండా నీటిని అందించడంపై దృష్టి సారించాలన్నారు.

ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటర్మీడియట్ తో పాటు టెన్త్, డిగ్రీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, నిశిత పర్యవేక్షణ జరపాలని సి.ఎస్ సూచించారు.

ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ శరత్ సీఎస్ కు తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో 118 పరీక్ష కేంద్రాలను,26 స్టోరేజీ పాయింట్లు ఏర్పాటు చేశామని, చీఫ్ సూపర్డెంట్ ల గదులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

టి ఎస్ ఆర్ టి సి వారు పరీక్ష సమయాలకు అనుకూలంగా బస్సులు నడిపేలా, విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేసేలా విద్యుత్ శాఖకు, వేసవి కాలమైనందున ప్రతి పరీక్ష కేంద్రం లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఓఆర్ఎస్ పాకెట్లు, మెడికల్ కిట్ తో ఏఎన్ఎం ను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆయా శాఖలకు తగు ఆదేశాలు జారీ చేశామన్నారు.

చీఫ్ సూపర్డెంట్ లకు, డిపార్ట్మెంటల్ అధికారులకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహించామని, అనుబంధ శాఖలతో కోఆర్డినేషన్ మీటింగ్ పూర్తయిందని తెలిపారు.

పరీక్షలు ప్రశాంతంగా సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీఎస్ కు వివరించారు.

అదేవిధంగా కంటి వెలుగు శిబిరాలను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని,
జిల్లాలో ఇప్పటివరకు 6,77,573 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 56,467 మందికి రీడింగ్ గ్లాసులు, 24 వేల మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసులను అందజేసామని తెలిపారు.

జిల్లాలో నాలుగు ఆరోగ్య మహిళ కేంద్రాలను ఏర్పాటు చేశామని,అందులో గత మూడు మంగళ వారాలలో 481 మంది మహిళలకు పరీక్షలు చేసినట్లు తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గాయత్రీ దేవి, సంబంధిత శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, పాల్గొన్నారు.

Share This Post