పరీక్షల యందు భయాన్ని విడనాడి ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ప్రణాళిక ప్రకారం సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి విద్యార్థిని విద్యార్థులకు సూచించారు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు కలెక్టర్ శుక్రవారం హాల్ టికెట్స్ అందించారు

ప్రచురునార్ధం వరంగల్ మే 13

పరీక్షల యందు భయాన్ని విడనాడి ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ప్రణాళిక ప్రకారం సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి విద్యార్థిని విద్యార్థులకు సూచించారు

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు కలెక్టర్ శుక్రవారం హాల్ టికెట్స్ అందించారు

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 23 నుండి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించబడతాయని… పరీక్షా సమయం ఉదయం 9:30 నుండి12.45 వరకు కేటాయించడం జరిగిందని అన్నారు

వరంగల్ జిల్లాలో 56 పరీక్షా కేంద్రాలలో 434 పాఠశాలల 9940 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారని.. వీరికి సంబంధించిన హాల్టికెట్స్ ప్రింటెడ్ సంబంధిత పాఠశాలలకు పంపడం జరుగుతుందని తెలిపారు

విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను కచ్చితంగా ఎక్కడ ఉన్నది ఒక రోజు ముందుగా వెళ్ళి తెలుసుకోవాలని పరీక్షల రోజులలో ఉదయం 8:45 కల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని… పరీక్ష సమయప్పుడు 9:30 తర్వాత విద్యార్థులను లోపలికి అనుమతించడం జరగదని కలెక్టర్ అన్నారు దీనిని ప్రతి విద్యార్థి దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు ఉన్నత చదువులు చదవాలంటే 10వ తరగతి తొలిమెట్టు అని.. పదవ తరగతి మంచి మార్కులతో పాస్ అయితే ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో కూడా మంచి కాలేజీలో సీట్లు సాధించి ఉన్నత చదువులు చదివి మంచి ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థానాల్లో స్థిరపడవచ్చు అని అన్నారు

10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కొరకు టి ఎస్ ఆర్ టి సి వారి ద్వారా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సమయానికి చేరుకునేలా అన్నీ ఏర్పాట్లు చేశామన్నారు

వరంగల్ జిల్లాలో 02 ఫ్లయింగ్ స్క్వాడ్ నియమించడం జరిగిందని పరీక్షల సమయంలో చూచిరాత కు పాల్పడిన విద్యార్థులను తెలంగాణ పబ్లిక్ పరీక్షల చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్షా కేంద్రాలలో ఒక ఏఎన్ఎం అందుబాటులో ఉంచి అత్యవసర పరిస్థితుల్లో అన్ని మందులు అందుబాటులో ఉంచుకుని చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు

హాల్ టిక్కెట్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Share This Post