పరీక్షా కేంద్రాలను పరిశీలించిన – అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

గురువారం జరిగిన పదవ తరగతి గణితం పరీక్ష కు 98.90 శాతం విద్యార్థులు హాజరయ్యారని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. హవేళిఘనాపూర్ మండలం బూరుగుపల్లి, హవేళిఘనాపూర్ జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇట్టి పరీక్షకు 11,271 మంది రెగ్యులర్ విద్యార్థులతో పాటు మరో ముగ్గురు ప్రైవేట్ విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని అన్నారు. ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలు , జిల్లా స్థాయి పరిశీలకులు తదితరులు ర్యాండంగా 31 కేంద్రాలను పరిశీలించారని అంతటా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయాని ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేవని నివేదించారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు మంచి నీటి సౌకర్యం, ఆరోగ్య కార్యకర్త ఏర్పాటుపై నిర్వాహకులని అడిగి తెలుసుకుని తప్పనిసరిగా ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అదనపు కలెక్టర్ సూచించారు.

Share This Post