పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

000000

      గ్రూప్1 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ఆదేశించారు.

 

     శనివారం తిమ్మాపూర్ లోని వాగేశ్వరి, శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో గ్రూప్1 పరీక్షా కేంద్రాలలో  ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 16న జరుగు గ్రూప్ వన్ పరీక్షలను పగడబందిగా నిర్వహించాలని  ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో సిసి కెమరాలను ఏర్పాటు చేయాలని కళాశాల సిబ్బందిని ఆదేశించారు.   పరీక్షల నిర్వహాణ పై ప్రభుత్వం జారిచేసే ఆదేశాలను తూచాతప్పక పాటిస్తూ అక్టోబర్ 10వ తేదికళ్లా  కేంద్రాలను పూర్తిస్థాయిలో సిద్దం చేయాలని అన్నారు.

 

            ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ , తిమ్మాపూర్ తహాసీల్దార్ కనకయ్య, కళాశాల యాజమాన్య సిబ్బంది తదితరులు  పాల్గోన్నారు.

Share This Post