పర్యాటక అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం:: ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక అధికారి ఎం. శివాజీ

పర్యాటక అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం:: ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక అధికారి ఎం. శివాజీ

జనగామ, ఆగస్టు 30: సెప్టెంబర్ 27 న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పర్యాటక శాఖ వివిధ విభాగాల నుండి అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోందని ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక అధికారి ఎం. శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తమ పర్యాటక రచన, ప్రచురణ విభాగంలో రెండు అవార్డులు, పర్యాటక రంగ ఫిలిం కేటగిరిలో ఒకటి, ట్రావెల్ ఏజెంట్/టూర్ ఆపరేటర్ విభాగంలో రెండు, స్టార్ కేటగిరి హోటల్స్ విభాగంలో రెండు, రోడ్ సైడ్ హోటల్స్ విభాగంలో రెండు, బెస్ట్ హరిత హోటల్ నుండి ఒకటి, బెస్ట్ థీమ్ రిసార్ట్ విభాగం నుండి మూడు, బెస్ట్ రెస్టారెంట్ విభాగం నుండి మూడు, బెస్ట్ టూరిస్ట్ గైడ్ నుండి ఒకటి, క్లీన్ టూరిస్ట్ డెస్టినేషన్ విభాగం నుండి రెండు, బెస్ట్ రూరల్ టూరిజం ప్రాజెక్ట్ విభాగం నుండి ఒకటి, బెస్ట్ కన్వెన్షన్ సెంటర్ విభాగంలో మూడు అవార్డులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. అర్హులైన వారు సెప్టెంబర్ 4 లోగా పూర్తిచేసిన దరఖాస్తులను కమీషనర్, పర్యాటక శాఖ కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వం, 3-5-891, టూరిజం హౌజ్, హిమాయత్ నగర్, హైదరాబాద్ కు అందజేయాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు 9440816065, 9440816068 మొబైల్ నెంబర్లను సంప్రదించాలని ఆ ప్రకటనలో పర్యాటక అధికారి పేర్కొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post