పర్యాటక దినోత్సవం సందర్భంగా వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మోమెంటో లు అందజేసిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
తేది: 27. 9. 2021
వనపర్తి

భావితరాల వారికి పర్యాటక ప్రదేశాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రదేశాలను పరిరక్షించాల్సిన బాధ్యత మనపై వుందని ఆమె అన్నారు. చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని ఆమె తెలిపారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.
జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ శ్రావణి అనే విద్యార్థిని ఉపన్యాసము బాగా చెప్పడంతో ఆయన అభినందించారు. అటవీ ప్రదేశాలను సంరక్షించాలని, కొండలు, గుట్టలు, పర్వతాలు వాటిని కాపాడితేనే మనకు స్వచ్ఛమైన గాలి అందుతుందని, తద్వారా పర్యావరణాన్ని కాపాడగలమని ఆయన అన్నారు.
పర్యాటక దినోత్సవ సందర్భంగా వివిధ పోటీలు నిర్వహించి, విద్యార్థులను విజేతలుగా ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
వ్యాసరచన పోటీలో మొదటి బహుమతి బి.వినయ్ కుమార్, 10వ తరగతి, ( ZPHS) కల్వరాల, రెండవ బహుమతి సి.మానస,10వ తరగతి, (ZPHS) జగత్ పల్లి. చిత్రలేఖనం పోటీలో మొదటి బహుమతి జి.అంకిత, 10వ తరగతి, ZPHS (G), అమరచింత, రెండవ బహుమతి బి.రుపశ్రి, 9వ. తరగతి, ZPHS, తెలుగు వాడ, వనపర్తి. ఉపన్యాస పోటీల్లో మొదటి బహుమతి ఎం.భవాని, 10వ. తరగతి, ZPHS, పెద్ద మందడి, రెండవ బహుమతి కె.శ్రావణి,10వ తరగతి, మదనపురం, మూడవ బహుమతి వి.అక్షయ, 10వ. తరగతి, ZPHS (G), కొత్తకోట విజేతలుగా నిలిచారని, వారికి మోమెంటోలు అందజేయడం జరిగిందని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్.పి. చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి అదనపు కలెక్టర్ వేణుగోపాల్, AJC అంకిత్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, జిల్లా పొర సంబంధాల అధికారి (పర్యాటకం శాఖ), ఎం. ఎ.రషీద్, డి. ఈ. ఓ. రవీందర్ జిల్లా అధికారులు, బి.సి. వెల్ఫేర్ అధికారి కేశవ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పర్యాటక శాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి నుండి జారీ చేయడమైనది.

 

Share This Post