పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కొరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు.

పత్రికా ప్రకటన                                                                తేది:14 .9 .2021

 పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కొరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు.

మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని ధరూర్ మండలం రేవులపల్లి జూరాల ప్రాజెక్టు దగ్గర రూ. 15 కోట్లతో ఏర్పాటు చేయనున్న గార్డెన్ పనులకు మంత్రితో పాటు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై శంకుస్థాపన గావించారు. 70 ఎకరాల లో ఏర్పాటు చేయనున్న పార్కు ద్వారా జూరాల ప్రాజెక్టు కు వచ్చే పర్యాటకులకు ఎంతో అనువుగా ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న గార్డెన్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులకు అర్చకులు, టిఆర్ఎస్ నాయకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, డాక్టర్ అబ్రహం, చిట్టెం రామ్ మోహన్ రెడ్డి, స్థానిక నాయకులు, తదితరులు  పాల్గొన్నారు.

——————————————————————–

       జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post