పర్యావరణ కాలుష్య నివారణకు మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలి :జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

పర్యావరణ కాలుష్య నివారణకు మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలి :జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 9: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను ప్రతిష్టించి ఆరాధించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జనగామ జిల్లా అధ్యక్షులు బెజ్జాల నవీన్ గుప్తా ఆధ్వర్యంలో ఫెడరేషన్ సభ్యులు గురువారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ను కలిసి, శుక్రవారం స్థానిక సెహ్రూ పార్క్ వద్ద గల వాస్తు గణపతి దేవాలయం వద్ద ఒక వేయి 321 మట్టి గణపతి విగ్రహాల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్ తో చేసిన విగ్రహాలతో పర్యావరణానికి, జలచరాలకు హాని కలిగే ప్రమాదం ఉందన్నారు. పర్యావరణ హితానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు. మట్టి గణపతి విగ్రహాల పంపిణీ చేపట్టిన వైశ్య ఫెడరేషన్ సభ్యులను కలెక్టర్ అభినందించారు.
ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సభ్యులు తాడూరి సంతోష్, రామోని శివుడు, కనకమళ్ల నర్సింహా రావు, నాళ్ళ మధు, గట్టు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post