పర్యావరణ పరిరక్షణకు మహిళలు తమ ఇంటినుండే కట్టుబడి ఉండాలని, తడి పొడి చెత్తను ఇంటిలోనే వేరు చేసి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డి హరిచందన సూచించారు

పర్యావరణ పరిరక్షణకు మహిళలు తమ ఇంటినుండే  కట్టుబడి ఉండాలని,  తడి పొడి చెత్తను ఇంటిలోనే వేరు చేసి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డి హరిచందన సూచించారు.

శుక్రవారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక శీలా గార్డెన్ లో అజదికి అమృత్ మహోత్సాహం లో భాగానగా సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర 2వరకు చేపట్టిన కార్యక్రమం లొ భాగంగా ఏర్పాటు చేసిన స్వచ్ సర్వేక్షన్ – హోమ్ కంపోస్టింగ్ పై మహిళలకు అవగాహనా సదస్సులో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ఆమె  మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం అనేది జీవితంలో భాగం అయిపోయిందని కానీ అదే ప్లాస్టిస్ వ్యర్థం భూమిలో కరిగి నాశనం కావడానికి 1000 సంవత్సరాలు పడుతుందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు మానవుల ఆరోగ్యంతో పాటు జీవరాశుల ఆరోగ్యం పై ఒక విష పదార్థం వలే హానికారకంగా పనిచేస్తుందన్నారు. అందుకే పర్యావరణ పరిరక్షణకు మహిళలు తమ ఇంటి వద్దే తడి పొడి చెత్తను వేరే వేరే చెత్తబుట్లలో వేరు చేసి ఇవ్వాలని సూచించారు. చెత్తను మున్సిపాలిటికి ఇవ్వకుండా బయట పార వేయడం వలన మానవాళి అనారోగ్యంకు గురి అయ్యే  ప్రమాదం ఉందన్నారు.  ఉన్నాయని సూచించారు. బయట చెత్త వేయడం వలన వాటిని తిన్న పశువులు ఆవుల కడుపులో సుమారు 5 కిలోల ప్లాస్టిక్ ను గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు.  పిల్లలకు ఆవుల ద్వార సేకరించిన పాలను ఇవ్వడం ద్వార పిల్లలు అనరోగ్యన్నికి గురి ఆయె అవకాశం ఉందన్నారు. కాబట్టి మన ఇంటి దగ్గరకు వచ్చే ట్రాక్టర్, ఆటో మున్సిపాలిటీ కార్మికులకు చెత్త ఇవ్వాలని తెలిపారు. వాటిని డంపింగ్ యార్డ్ కు తరలించి తడి పొడి చెత్తలను వేరు చేసి అక్కడే కంపోస్టింగ్ చేసి ఎరువును తాయారు చేస్తారని సూచించారు. ప్రజలు కూడా కంపోస్టింగ్ తాయారు చేసే విధాన్ని నేర్చుకొని ఇంట్లోనే ఎరువులను తాయారు చేసుకోవచ్చన్నారు. పట్టణాలలో వాటికి మంచి ప్రాధాన్యత ఉందన్నారు. ఇంట్లోనే తడి చెత్తతో కంపోస్టు ఎరువు తయారు చేయవచ్చన్నారు. మహిళలు అనుకుంటే దేనినైన సదిస్తారని వారి కుటుంభం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిఒక్క మహిళా తమ ఇంటి నుంచే మొదలు పెట్టాలని కోరారు. కాలుష్యం అనేది పొగ ద్వారానే వస్తున్దనడం కాదని చెత్త ద్వార సైతం కాలుష్యం ఏర్పడుతుందన్నారు. రోడ్డు పై వేసే చెత్త ద్వార కూడా కాలుష్యం ఏర్పడుతుందని సూచించారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కు మొదటి ప్రాధాన్యత నిస్తుందని పేర్కొన్నారు.  జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని దీనిని సద్వినియోగం చేసుకొని ఈ సర్వేక్షన్ లో పాల్గొని మీ ప్రాంతంలో జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమం పై మీ అభిప్రాయం తెలియజేయాలన్నారు.  దీనికి మీ మొబైల్ లో యస్.యస్.జి. సి.యఫ్ (SSG -CF) యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఆన్లైన్ ద్వారా అభిప్రాయం తెలియజేయాలని సూచించారు. అనంతరం అవగాహనా సదస్సు కు వచ్చ్సిన మహిళా ల ద్వార నారాయణపేట జిల్లా ను స్వచ్ నారాయణపేట గా తీర్చిదిదుతాము అని  ప్రతిజ్ఞ చేయడంజరిగింది.

ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గందే అనుసుయ్య చంద్రకాంత్, వైస్ చైర్మన్ హరినరయన్ భట్టాడ్, మున్సిపల్ కౌన్సిలర్ లు మరయు మహిళలు  తదితరులు పాల్గొన్నారు.

Share This Post