పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు మట్టి గణపతులను ప్రతిష్టించు కోవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో మట్టి గణపతులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, బి.సి. అభివృద్ధి అధికారి జగదీశ్ తో కలిసి ప్రజలకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాలలో శ్రేష్టమైన మట్టితో గణపతులను తయారు చేయించామని తద్వారా వృత్తిదారులకు జీవనోపాధి లభించి ఆర్థికంగా లబ్ది చేకూరిందని అన్నారు. పాపన్నపేట మండలంలోని అబులాపూర్, కుర్తివాడ, తూప్రాన్, అల్లాపూర్, మిర్జాపల్లి, వడియారం, చేగుంట, ఘనపూర్, పైత్ర , మెదక్ పట్టణాలలో 11,300 మట్టి గణపతి ప్రతిమలను తయారు చేయించామని అన్నారు. వీటిని మెదక్ మునిసిపాలిటీల్లో 3 వేలు, తూప్రాన్, నరసాపూర్ , రామాయంపేట మునిసిపాలిటీలు ఒక వేయు చొప్పున అందిస్తున్నామని అన్నారు. అలాగే 2 వేల నుండి 3 వేల లోపు జనాభా గల గ్రామా పంచాయితీకి వంద ప్రతిమలు, 3 నుండి 5 వేల లోపు జనాభాకు 150, 5 వేల పై బడిన జనాభా గల గ్రామ పంచాయతియీలకు 200 చొప్పున మొత్తం 39 గ్రామా పంచాయతీలకు 5,300 ప్రతిమలు అందజేస్తున్నామని అన్నారు. రవాణా చార్జీలతో కలుపుకొని ఒక్కో ప్రతిమకు 32 రూపాయల ఖర్చుగా కాగా ఈ 11,300 మట్టి గణపతులను ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. బుధవారం నుండి మునిసిపాలిటీలలో, గ్రామా పంచాయితీలలో ప్రజాప్రతినిధులచే ఈ మట్టి గణపతులు పంపిణి చేస్తారని కలెక్టర్ చెప్పారు. పి.ఓ.పి. రంగులు, రసాయనాలతో రూపొందించిన గణపతులవల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు నీళ్లు కలుషితమవుతాయని, ప్రజలు ఇది గమనించి వినాయక చవితి పర్వదినాన మట్టి గణపతులను ప్రతిష్ఠించుకొని పూజించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.పి .ఓ. తరుణ్ కుమార్, డి.ఎస్.డి.ఓ. విజయలక్ష్మి, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ కృష్ణ మూర్తి, ఎస్సి కారప్లోరేషన్ ఈ.డి. దేవయ్య, డి.ఈ.ఓ. రమేష్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజా రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షులు బాలకృష్ణ, మెదక్ జిల్లా మాస్టర్ ట్రైనర్ కుమ్మరి బ్రహ్మానందం,గోపాల్, మల్లేష్ తదితరులు సంఘం సభ్యులు పాల్గొన్నారు
పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు మట్టి గణపతులను ప్రతిష్టించు కోవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు
