పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత….. అదనపు కలెక్టర్ రాజర్షి షా పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, సెప్టెంబర్ 9:–

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత….. అదనపు కలెక్టర్ రాజర్షి షా

పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మట్టి వినాయకుల విక్రయ కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాజర్షి మాట్లాడుతూ వినాయక చవితి పండుగకు ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను ఏర్పాటు చేసి పూజించాలని ఆయన కోరారు. మట్టి వినాయకుల ఏర్పాటుతో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడిన వారమవుతామన్నారు. మట్టి వినాయకుల ప్రతిష్టాపన వల్ల వాయు,జల కాలుష్యాలు తగ్గుతాయన్నారు. అదేవిధంగా కుమ్మరి, శాలివాహన కులస్తులకు ఆర్థికంగా చేయూత లభిస్తుందన్నారు.

జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి కేశురామ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మట్టి వినాయకుల తయారీ కి మాస్టర్ ట్రైనర్స్ కు శిక్షణ ఇప్పించి, వారి ద్వారా జిల్లాలో పలువురు కుమ్మరి శాలివాహన కులస్తులకు మట్టి వినాయకుల తయారీలో శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. శిక్షణ పొందిన వారు తయారుచేసిన వినాయక విగ్రహాలను విక్రయించడానికి విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు అఖిలేష్ రెడ్డి, సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారులు విట్టల్ ,భాగ్యలక్ష్మి, వెంకట నరసమ్మ ,మాస్టర్ ట్రైనర్ మరియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్, అసోసియేట్ ప్రెసిడెంట్ కుమ్మరి రామ్ చందర్, జిల్లా కోశాధికారి పరమేశ్వర్, కుమ్మరి శాలివాహన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post