పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

జులై 31, 2021ఆదిలాబాదు:-

            పచ్చదనం పెంపుదల, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత నిర్వహణ ద్వారా గ్రీన్ ఛాంపియన్ అవార్డు ను ప్రదానం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ విద్య మండలి ఒక జిల్లా- ఒక హరిత విజేత లో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు గ్రీన్ ఛాంపియన్ అవార్డు ను శనివారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో కళాశాల ప్రిన్సిపాల్ కు అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, భావితరాల వారికీ, విద్యార్థులకు పాఠ్య అంశాలకు సంబందించిన మొక్కలను పెంచి వాటి ఉపయోగం పై విశ్లేషించడం జరగాలని, కళాశాల ఆవరణలో హరితహారం కార్యక్రమం కింద పెద్ద ఎత్తున మొక్కలను నాటి సంరక్షించాలని అన్నారు. యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ నిర్వహించాలని, అటవీ, ఉద్యానవన శాఖల అధికారుల సలహాలు స్వీకరించి మరిన్ని అవసరమైన మొక్కలను నాటాలని సూచించారు. విజేతగా నిలిచిన కళాశాల ప్రిన్సిపాల్ టి.ప్రతాప్ సింగ్ కు ప్రశంస పత్రాన్ని కలెక్టర్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, కళాశాల 16 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉందని, సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో సైన్స్ విద్యార్థులకు అవసరమయ్యే బటానికల్ గార్డెన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి మొక్కకు క్యూ ఆర్ కోడ్ ను ఏర్పాటు చేస్తున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రాం అధికారులు డి.దయాకర్, జి.చంద్రశేఖర్ పాల్గొన్నారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ విద్య మండలి హైదరాబాద్ వారు మధ్యాహ్న సమయంలో నిర్వహించిన సమయంలో నేరడిగొండ తహసీల్దార్ కార్యాలయం నుండి జూమ్ కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పాల్గొని కళాశాలలో చేపడుతున్న కార్యక్రమాలపై వివరించారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో శిరీష ప్రసాద్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ గా వ్యవహరించారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post