పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలి – జిల్లా కలెక్టర్- పి ఉదయ్ కుమార్

పత్రికా ప్రకటన

తేదీ 30.08.2022

పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

పట్టి పాత్రలు తయారీకి ప్రభుత్వం ప్రోత్సకాహాల అందిస్తుంది

పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ సంరక్షణ కోసం జిల్లాలో 1000 మట్టి విగ్రహాలను నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ల ద్వారా పట్టణాల్లో ప్రజలకు మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఆదిదేవుడైన వినాయకుని మట్టితో తయారు చేసి పూజించటం ద్వారా సత్ఫలితాలు లభిస్తాయని, మన ఆకాంక్షలు నెరవేరుతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. మట్టి విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణ సంరక్షణ జరుగుతుందని, మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కాలుష్య నియంత్రణ మండలి వెనుక బడిన తరగతుల సంస్థ ద్వారా శిక్షణ పొందిన శాలివాహన, కమ్మరి సంఘాల వారికి ఉపాధికి దోహదం చేస్తూ పని కల్పించి తయారు చేపించినట్లు తెలిపారు.
జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
(శాలివాహన) కుమ్మరులు ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని మరింత అభవృద్ధికి ప్రభుత్వం దోహదపడుతుందన్నారు. అందుకు బిసి సంక్షేమ శాఖ, పరిశ్రమల శాఖ, ఇతర బ్యాంక్ రుణాలు వంటి వారిని ఉపయోగించుకోవాలని సూచించారు. అన్ని రకాల మట్టి పత్రాలను తయారీ చేసే పరిశ్రమ ఏర్పాటు కోసం (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపర్ట్) డిపియర్ తయారు చేసి తీసుకురావాలని కుమ్మరుల సంఘం నాయకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుక బడిన తరగతుల అభివృద్ధి అధికారిణి అనిల్ ప్రకాష్, ముఖ్య ప్రణాళిక అధికారి, భూపాల్ రెడ్డి, డిపిఆర్ఓ సీతారాం, జిల్లా వయోజన విద్యాధికారి శ్రీనివాసరెడ్డి, పరిశ్రమల అధికారి హనుమంతు, సహాయ బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీధర్ జి, కుమ్మర శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షుడు రఘు బాబు, ప్రధాన కార్యదర్శి మధు, రాజకీయ విభాగం కో కన్వనర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాములు, జిల్లా మీడియా విభాగం కార్యదర్శి మల్లేష్, ఉపాధ్యక్షులు జంగయ్య, వృత్తి విభాగం నాయకులు నర్సింహ, సంఘం నాయకులు రవి,
కలెక్టరేట్ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
…………………………. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి నాగర్ కర్నూల్ నుండి జారీ చేయడం అయినది.

Share This Post