పలిమెల, మహాదేవపూర్, మరియు మహాముత్తారం మండలంలో ప్రయోగాత్మకంగా ఫోర్టిఫైడ్ (బలవర్థకమైన) బియ్యాన్ని చౌక ధరల దుకాణాల ద్వారా పేద ప్రజలకు అందించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత అధికారులను ఆదేశించారు

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి సెప్టెంబర్ 7 (మంగళవారం).
పలిమెల, మహాదేవపూర్, మరియు మహాముత్తారం మండలంలో ప్రయోగాత్మకంగా ఫోర్టిఫైడ్ (బలవర్థకమైన) బియ్యాన్ని చౌక ధరల దుకాణాల ద్వారా పేద ప్రజలకు అందించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని జేసీ చాంబర్ లో పౌరసరఫరాలశాఖ మరియు రెవెన్యూశాఖల అధికారులతో జేసీ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఫోర్టిఫైడ్ బియ్యమును చౌక ధరల దుకాణాల ద్వారా ప్రజలకు పంపిణీ చేయుటకు జిల్లా పైలెట్ జిల్లాగా ఎంపికైందని దానిలో భాగంగా ముందస్తుగా జిల్లాలోని పలిమెల, మహాదేవపూర్, మహాముత్తారం మండలాలలో ప్రయోగాత్మకంగా ఈ బియ్యాన్ని అందించడం జరుగుతుందని ఈ నెల నుండి ఎంపిక చేసిన మూడు మండలాల్లో పేద ప్రజలకు ప్రజలకు చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించారు. ఫోర్టిఫైడ్ రైస్ అనేది రుచితో పాటు అధిక పోషక విలువలు కలిగిన బియ్యమని ఫోర్టిఫైడ్ బియ్యాన్ని తినడం వలన అనీమియాను అధిగమించవచ్చని, దీనిలో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుందని, ఫోలిక్ యాసిడ్ గర్భస్థ శిశువు అభివృద్ధి చెందడంలో మరియు రక్తం తయారీకి సహాయపడుతుందని, విటమిన్ బీ 12 రక్తం తయారీ మరియు నరాల వ్యవస్థ సాధారణంగా పని చేయడంలో సహాయపడుతుందని అన్నారు. ఈ బియ్యాన్ని తగినంత నీటిలో నానబెట్టి అదే నీటితో వంట వండేలా మరియు నేరుగా సూర్యరశ్మి బియ్యంపై పడకుండా నిలువ చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఫోర్టిఫైడ్ బియ్యం నిల్వ చేసే గదులు వాటర్ లీకేజీ లేకుండా పరిశుభ్రంగా ఉండేలా మరియు గాలి చొరబడకుండా పాలితిన్ లేదా టార్పాలిన్ సీట్లను వాడేలా రేషన్ షాప్ డీలర్ లు ప్రత్యేక చర్యలు తీసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి గౌరీ శంకర్, పౌరసరఫరాలశాఖ మేనేజర్ రాఘవేందర్, ఏఎస్ఓ ముక్తార్, సివిల్ సప్లై డిటి మల్లేష్, మూడు మండలాల డిప్యూటీ తాసిల్దారులు, సీనియర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post