పత్రికాప్రకటన.2 తేదిః 26-11-2021
పలు అభివృద్ది నిర్మాణ పనులును పరిశీలించిన జిల్లా కలెక్టర్
జగిత్యాల, నవంబర్ 26: జిల్లా అభివృద్దిలో బాగంగా చేపడుతున్న వైద్య కళాశాల, ఎంసిహెచ్ అసుపత్రిలోని అధనపు పడకల నిర్మాణా పనులను మరియు చల్గల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మిస్తున్న మామాడి దుకాణాల సముదాయ నిర్మాణపనులను పరిశీలించారు. గుత్తేదారులు నాణ్యతప్రమాణాలను పాటించకుండా నిర్మాణాలను చేపట్టకుండా నిర్మాణ పనులు చేపట్టకుండా పర్యవేక్షించాలని, సకాలంలో నిర్మాణపనులను పూర్తిచేయడానికి అవసరం మేరకు కూలీలను అధనంగా ఉపయోగించుకోని ప్రారంబానికి సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో ఇఇ ఆర్ ఆండ్ బి శ్రీనివాస్, మార్కేటింగ్ ఎడి ప్రకాశ్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిటెండెంట్ శ్రీమతి సుదక్షిణాదేవి, ఇతర అధికారలు, గుత్తేదారులు పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.