పలు అభివృద్ధి పనులపై మునిసిపల్, ఎలక్ట్రిసిటీ, పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం : జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన. తేది:29.12.2021, వనపర్తి.

వనపర్తి జిల్లా అభివృద్ధి పనులలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
బుధవారం వనపర్తి మున్సిపాలిటీ కార్యాలయంలో పలు అభివృద్ధి పనులపై మునిసిపల్, ఎలక్ట్రిసిటీ, పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, మిషన్ భగీరథ పెండింగ్ పనులు పూర్తిచేయాలని ఆయన సూచించారు. అభివృద్ధి పనులలో సమస్యలను ఆయన మున్సిపల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల మధ్యలో ఉన్న హైటెన్షన్ వైర్ల వలన పట్టణ ప్రజలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వెంటనే వాటిని వేరే చోటికి షిఫ్ట్ చేయాలని ఆయన సూచించారు. రామన్ పాడు నుండి పట్టణానికి వచ్చే మంచినీటి సరఫరాలో అంతరాయం జరుగుతుందని మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఎలక్ట్రిసిటీ డి.ఇ.లు జిల్లా అదనపు కలెక్టర్ కి వివరించారు. పారిశుద్ధ్య కార్మికులకు వారికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని, మున్సిపాలిటీ పరిధిలో పరిశుభ్రత పాటించేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ సిబ్బందికి ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో ఎలక్ట్రిసిటీ, మున్సిపల్ DE, AE లు,  Dy.EE వెంకన్న, AE భాస్కర్, AE హేమలత, మేనేజర్ ఖజా,  సానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post