పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
12 .10 .2021
వనపర్తి

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

మంగళవారం పెద్దమందడి మండలం లో నాగర్ కర్నూలు ఎంపీ రాములు, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మపల్లి, పెద్ద మునగాల చెడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 33/100 కెవి సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. వెల్టూరు గ్రామంలో పీహెచ్సీ, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అలాగే చిక్కుడు చెట్టు తండాలో లెమన్ గ్రాస్ తో తయారయ్యే సుగంధ ద్రవ్యాల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమయ్యే కనీస సౌకర్యాల తోపాటు రైతులకు ఉచిత విద్యుత్ సాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. వ్యవసాయం దండగ కాదు పండుగ అనే రీతిలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో బీడు పొలాలను చిగురించేలా చేశారని అన్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కొరకు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కొరకు పాటుపడుతున్న దని అన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటూ ఉన్నదని ఎంపీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కూడా జిల్లాలో వస్తున్నాయని లెమన్ గ్రాస్ ద్వారా సుగంధద్రవ్యాలు తయారు చేసే పరిశ్రమ జిల్లా లో నెలకొల్పడం హర్షణీయమని అన్నారు. వనపర్తి జిల్లాలో మంత్రి ప్రోద్బలంతో వ్యవసాయంతో పాటు అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని కలెక్టర్ తెలిపారు.

………. జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి జారీ చేయడమైనది.

Share This Post