పల్లెనిద్ర ద్వారా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు వీలవుతుందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.

పత్రికా ప్రకటన                                                                       మహబూబ్ నగర్
6 .7.2021
________________________________

పల్లెనిద్ర ద్వారా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు వీలవుతుందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.
మంగళ వారం ఆయన బాలానగర్ మండలం చెన్నంగుల గడ్డ తాండ లో పల్లె నిద్ర చేశారు.
పల్లె నిద్రలో భాగంగా నెలలో ప్రతి బుధవారం తాసిల్దారులు, గురువారం ఎం పి డి ఓ లు, శుక్రవారం ప్రత్యేకాధికారులు,శనివారం ఎంపీడీవోలు పల్లెల్లో నిద్ర చేయాలని చెప్పారు. దీనివల్ల ఆ గ్రామ పరిధిలో ఉన్న సమస్యలను రాత్రి లేదా ఉదయం గుర్తించి పరిష్కరించేందుకు అవకాశం ఉందిఅని తెలిపారు .
నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో మహిళలు, యువకులు అనేక మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి శ్రమాధాన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, అంతేకాక పల్లె ప్రగతి ప్రారంభమైన రోజు నుండి ఇప్పటివరకు జిల్లాలో 8 లక్షల 50 వేల మొక్కలు నాటడం జరిగిందని, మరో పది లక్షల మొక్కలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని, అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా మొక్కల పంపిణీ కొంచెం జాప్యం చేస్తున్నట్లు తెలిపారు. తిరిగి వర్షాలు ప్రారంభమైనందున ఇంటింటింటి కి 6 మొక్కలు ఇవ్వటం జరుగుతుందని,ప్రతి గృహస్తు తప్పనిసరిగా మొక్కలు నాటుకోవాలని ఆయన కోరారు.
అనంతరం జిల్లా కలెక్టర్ గ్రామ పంచాయతీలో భోజనం చేసి అక్కడే నిద్రించారు.

________________________________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు,సమాచార శాఖ,మహబూబ్ నగర్

 

Share This Post