పల్లెప్రగతి ప్రగతిలో ఉత్తమ గ్రామపంచాయతీలకు అవార్డుల ప్రధానం : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

గ్రామీణ స్ధాయి నుండి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రగతి సాధించిన గ్రామపంచాయతీలను ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపిక చేసి వారికి కేటాయించిన మార్కుల ప్రకారముగా అవార్డులు అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవనంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్దితో కలిసి అవార్జుల సంబంధిత గోడప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని మందల, డివిజన్‌ పరిధిలో ఉత్తమ గ్రామపంచాయతీలను ఎంపిక చేయడం జరిగిందని, 11 రకాల క్యాటగిరీలలో గ్రామపంచాయతీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో ఆయా గ్రామాలలో జరిగిన ప్రగతి ప్రకారముగా మార్ములు వేయడం జరుగుతుందని తెలిపారు. మార్కుల కేటాయింపు జిల్లా, డివిజన్‌, మండల స్థాయిలలో పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా స్థాయిలో జైనూర్‌ మండలం మార్లవాయి గ్రామం, డివిజన్‌ స్థాయిలో దహెగాం మండలం బీబ్రా, రెబ్బెన మండలం కొండపల్లి గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని, మండల స్థాయిలో కాగజ్‌నగర్‌ డివిజన్‌లోని బెజ్టూర్‌ మండలం కుస్నేపల్లి, చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్‌, దహెగాం మండలం కమ్మర్‌పల్లి, కాగజ్‌నగర్‌ మండలం ఈస్టాం, కాటాల మండలం కౌటాల, పెంచికల్‌పేట మండలం ఎల్మపల్లి, సిర్పూర్‌ (టీ) మండలం వేంపల్లి గ్రామాలను, ఆసిఫాబాద్‌ డివిజన్‌లో ఆసిఫాబాద్‌ మండలం అడ, జైనూర్‌ మండలం దుబ్బగూడ, కెరమెరి మండలం జరి, లింగాపూర్‌ మండలం కొత్తపల్లి, రెబ్బెన మండలం నంబాల, సిర్పూర్‌ (యు) మండలం పాములవాడ, తిర్యాణి మండలం దేవాయిగూడ, వాంకిడి మండలం దాబా గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో ఒక వేదిక ఏర్పాటు చేసి అత్యధిక మార్కులు సాధించిన ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్భులను పిలించి అవార్డులు అందజేయడంతో పాటు జిల్లా స్థాయిలో ఎంపిక చేసిన వారికి 1 లక్ష రూపాయలు, డివిజన్‌ స్థాయి వారికి 75 వేల రూపాయలు, మండల స్థాయిలో 50 వేల రూపాయల పారితోషికం అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవికృష్ణ, జిల్లా సహకార అధికారి, సంబంధిత శాఖల అధికారులు
తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post