పల్లెప్రగతి మరియు ఉపాధి హామీ పనులు నిరంతర ప్రక్రియ :: జిల్లా కలెక్టర్ జి. రవి

పల్లెప్రగతి మరియు ఉపాధి హామీ పనులు నిరంతర ప్రక్రియ :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన                                                                                                                                                                                                                                                        తేదిః 31-07-2021

                                                            పల్లెప్రగతి మరియు ఉపాధి హామీ పనులు నిరంతర ప్రక్రియ  ::  జిల్లా కలెక్టర్ జి. రవి

          జగిత్యాల, జూలై 31: జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రగతి ఉపాధిహామీ పనులను నిరంతర ప్రక్రియగా కొనసాగించి జిల్లాను అభివృద్ది పథంలో ముందంజలో ఉంచాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు.  శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుండి పల్లెప్రగతి ఉపాధిహామీ పనుల ప్రగతిపై అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, వైకుంటధామాల నిర్మాణాలలో ఇంకా పూర్తిచేయవలసి ఉన్నవాటిని వెంటనే పూర్తిచేయించాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని సమీక్షించి అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తిచేయించాలని సూచించారు.  నిర్మాణాలు పూర్తికాని మ్యాజిక్ సోక్పిట్ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అన్నారు.  నిధులకు సంబంధించి సోషల్ ఆడిటింగ్ జరిపించి పనులు జరగని వాటికి సంబంధించి నిధులను రికవరి చేయించాలని సూచించారు.  అన్ని చోట్ల వందశాతం బయోఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, బాంబో, కచ్చకాయ మరియ మైదాకు మొక్కలతో బౌడ్రిలను ఏర్పాటు చేయాలని,  పంచాయితి సెక్రటిరి, ఎపిఓ లు ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి గతంలో నాటిన మొక్కలలో పాడైనవాటిని గుర్తించి వాటిస్థానంలొ వేరె మొక్కలను నాటేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.  రైతువేధికలు, వైకుంటదామాలు, సెగిరికేషన్ షెడ్,  పల్లెప్రకృతి వనాలలో బయోఫెన్సింగ్ ద్వారా మొక్కలను నూరుశాతం నాటాలని,  మొక్కలు అందుబాటులో లేకపోయినట్లయితే కోనుగోలు చేసుకుని తేప్పించి నాటాలని పేర్కోన్నారు.   ప్రతినెల 28వ తేదిలోగా కరెంటు చార్జీలు, ట్రాక్టర్ లోన్ కు సంబంధించిన చెల్లింపులు జరగాలని, అవసరం లేని చోట  కనెక్షన్లను తొలగించాలని,  పంచాయితి అధికారులు ప్రతినేల పర్యవేక్షించాలని ఆదేశించారు.   ప్రతిరోజు జరుగుతున్న పనులను అధికారులు ఖచ్చితంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉపాధిహామి పనులు వేగవంతం చేయాలని, ఉపాధి హామి కూలీల సంఖ్యను పెంచాలని,  సెగిరికేషన్ షెడ్ లలో తడి, పోడి చేత్త ద్వారా ఎరువును  తయారు చేసి  గ్రామపంచాయితి ఆదాయం పెంచాలని, గుర్తించిన బృహత్ వనాలలో మొక్కలను నాటాలని, మల్టి లేయర్ ఎవెన్యూ ప్లానిటేషన్లో నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి అరుణశ్రీ, డిఆర్డిఓ పిడి వినోద్, జిల్లా పంచాయితి అధికారి నరేష్, ఇతర అధికారులు పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి  కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

పల్లెప్రగతి మరియు ఉపాధి హామీ పనులు నిరంతర ప్రక్రియ :: జిల్లా కలెక్టర్ జి. రవి

Share This Post