ప్రచురణార్ధం
మహబూబాబాద్, డిసెంబర్, 31.
జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధిలో ముందంజలో ఉందని జిల్లా స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ నివేదించారు.
శనివారం కలెక్టర్ కార్యాలయం లోని వీడియో కాన్ఫరెన్స్ ప్రజ్ఞ సమావేశ మందిరంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మంచినీటిశాఖ అభివృద్ధిపై హైదరాబాద్ నుండి జిల్లా స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ లతో ఉన్నతాధికారులు తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సమీక్షించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఇంత అభివృద్ధి జరగలేదన్నది వాస్తవం అన్నారు. ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నట్లు మంత్రికి తెలియజేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రణాళిక పరంగా చేపట్టిన కార్యక్రమాలకు ప్రజలు నీరాజనం పడుతున్నారన్నారు. అన్నిరంగాల్లో విజయవంతంగా ముందంజలో నడిపిస్తున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా 3వేలకు పైగా తండాలను గ్రామపంచాయతీలను చేయడం జరిగిందని భవనాలను నిర్మించేందుకు ఒక్కొక్క భవనానికి 20 లక్షలు చొప్పున మంజూరు చేశారన్నారు.త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించనున్న ట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి పథకాలు చేపట్టి అమలు చేస్తున్నదన్నారు. చేపట్టిన పనులకు బిల్లులు చెల్లింపులో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఉపాధిహామీ పథకం పనులు కల్పిస్తూ పనుల వేగవంతానికి ఫీల్డ్ అసిస్టెంట్ లతో చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఉపాధిహామీ పనులకు నిధుల చెల్లింపు పై కేంద్ర నోడల్ బృందం సందర్శించి క్షేత్ర స్థాయిలో సందర్శించి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిందని మంత్రికి తెలిపారు.
ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్ లను ఏర్పాటు చేసినందున హరితహారం మొక్కలకు నీళ్లు పోయిస్తూ గ్రామపంచాయతీ లకు వనరులు చేకూరేలా చర్యలు తీసుకున్నామన్నారు. వైకుంఠ దామాలకు సరికొత్తరూపు వచ్చిందని, గ్రామాలకు వన్నె తెచ్చిందన్నారు.
మంత్రి మాట్లాడుతూ ఇంత అభివృద్ధి జరిగినా అసత్య ప్రచారం చేస్తున్నారని, అటువంటి వాటిపై వివరణ ఇవ్వాలన్నారు.అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
సిరిసిల్ల, మెదక్ వనపర్తి, నారాయణపేట తదితర జిల్లాలు ఈ విషయంలో అగ్రగామిగా నిలిచాయన్నారు.
పల్లెప్రగతిలో ప్రతి గ్రామంలో పారిశుధ్యం మెరుగు పరుస్తూ హరితహారం తో పూలమొక్కలు నాటి అందమైన పార్కులు ఏర్పాటు అయ్యాయన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జడ్పి సి.ఈ.ఓ.రమాదేవి, డి.ఆర్.డి.ఓ.సన్యాసయ్య, డి.పి.ఓ.సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.